Theft of 200 shoes : రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు.. పాపం అన్నీ కుడి పాదానికి వేసుకునేవట..

ఓ విచిత్రమైన దొంగతనం గురించి చెప్పాలి. ఓ చెప్పుల దుకాణంలో దొంగలు చొరబడి రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు. తొందరపాటులో చేశారో.. కావాలనే చేశారో అన్నీ కుడి పాదానికి వేసుకునే షూలు ఎత్తుకెళ్లారు.

Theft of 200 shoes : రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు.. పాపం అన్నీ కుడి పాదానికి వేసుకునేవట..

Theft of 200 shoes

Updated On : May 6, 2023 / 2:56 PM IST

Theft of 200 shoes : కష్టపడి ఓ స్కెచ్ వేశారు. షూల దుకాణంలో దూరారు. చేతికందిన షూలు ఎత్తుకెళ్లారు కట్ చేస్తే వాళ్లు దోచుకెళ్లిన షూలన్నీ కుడి పాదానికి వేసుకునేవట. ఈ దొంగతనానికి సంబంధించిన వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

పెరూవియన్ సిటీ హువాన్‌కాయోలోని ఓ చెప్పుల దుకాణంలోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. 200 లకు పైగా షూలని దొంగిలించారు. తీరా అవన్నీ కుడి పాదానికి వేసుకునేవట. షాప్ యజమాని చెబుతున్న వివరాల ప్రకారం వాటి ధర 13,000 ల డాలర్లు.. అంటే 10 లక్షల కంటే ఎక్కువ అన్నమాట. సీసీ కెమెరాలో అర్దరాత్రి చెప్పుల దుకాణంలోకి చొరబడినట్లు కనిపిస్తోందట. అయితే వాళ్లు కావాలనే కుడి పాదాలకి వేసుకునే బూట్లని ఎత్తుకెళ్లారా?  అయితే వాటిని ఏం చేసుకుంటారు? కనీసం అమ్మడం కూడా కష్టం కదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Bangladesh: దొంగతనం అయితే చేశాడు కానీ.. ఎలా తప్పించుకోవాలో తెలీక పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరిన దొంగ

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫుటేజీని, వేలిముద్రలను పరిశీలించి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.