నిజానికి.. చెట్లను కట్ చేసే రంపాన్ని ప్రసవం చేయడానికి తయారుచేశారట

నిజానికి.. చెట్లను కట్ చేసే రంపాన్ని ప్రసవం చేయడానికి తయారుచేశారట

Updated On : February 12, 2021 / 1:39 PM IST

Childbirth with Chainsaws: చెట్లను కట్ చేసే రంపం చూసే ఉంటారు. అదేనండీ చైన్‌సా. ఎంత పెద్ద చెట్లనైనా ముక్కలుముక్కలుగా చేసేయగలవు. వాటిని ఈ రేంజ్ లో ఉపయోగిస్తున్నారు. కానీ, వాటిని తయారుచేసిన ఉద్దేశ్యం వేరు. కేవలం ప్రసవాల కోసమే వాటిని రెడీ చేశారట. తల్లి గర్భం నుంచి వేరు చేసేటప్పుడు పేగు కట్ చేయడం కోసం చైన్ సాను ఉపయోగించాలని తయారుచేశారు.

ఆ రోజుల్లో ప్రసవాలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. కచ్చితంగా సీ సెక్షన్ చేస్తేనే గానీ జననం కుదరదని చెప్తున్న డాక్టర్లదే ట్రెండ్ నడుస్తుంది. ఆవుల మాంసం అమ్మే వ్యక్తి తన భార్య కోసం స్విట్జర్లాండ్ లో 1500కాలంలో మొదటిసారి జరిగింది. 1597లోనే కొద్ది రోజులకు సీ సెక్షన్స్ సేఫ్ గా మారిపోయాయి. పెల్విస్ కట్ చేసి బిడ్డ ప్రసవాన్ని సున్నితంగా చేయడం మొదలుపెట్టారు.

చాలా సంవత్సరాల తర్వాత ఓ మహిళ ప్రసవం సమయంలో ప్రాణాల మీదకు వచ్చి ఇద్దరి ప్రాణాలకు ప్రమాదమనిపించిన తర్వాత మరోసారి సీ సెక్షన్ చేసినట్లు వెస్టరన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ 1830 ఎడిషన్ లో రాసుకొచ్చారు. ఆ సమయంలో తల్లి పొట్టభాగంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో.. పొట్ట పెద్దగా ఉండి సాధారణ కత్తెరలతో కట్ చేయడం కుదరలేదు. తల్లి లేని బిడ్డ కంటే బిడ్డ లేని తల్లి బెటర్ అని భావించి సర్జరీ చేసేసినట్లు పిండాన్ని తీసేశారని ఆ డాక్టర్ ఓ బ్లాగులో రాసుకొచ్చారు.

ఇక 18వ శతాబ్దం చివర్లో మరోసారి ఇద్దరు స్కాటిష్ డాక్టర్లు సర్జరీ చేశారు. చైన్ సా ఉపయోగించి.. ప్రపంచంలోనే తొలిసారి ప్రసవం చేశారు. పెల్విస్ ను కట్ చేయడం ఎలా అనిపించిందంటే పెన్సిల్ పదును పెట్టినట్లుగా జరిగిందని డాక్టర్లు అంటున్నారు. తర్వాతి కాలంలో ఈ పరికరం జాయింట్లు తొలగించడానికి ఉపయోగపడేది. 1905 నుంచి దీనిని చెట్లు కట్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు.