అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం

  • Published By: venkaiahnaidu ,Published On : March 14, 2019 / 03:19 PM IST
అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం

అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్పువ్యోమింగ్,దక్షిణ డకోటా,వాయువ్య మిన్నిసోటా,నెబ్రస్కా రాష్ట్రాల్లో గురువారం(మార్చి-14,2019)భీకర గాలులు వీస్తున్నాయి.రవాణా స్థంభించిపోయింది.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల సంఖ్యలో ప్రజలు చీకట్లో గుడుపుతున్నారు.విమనాల రాకపోకలను నిలిపివేశారు.దేశవ్యాప్తంగా 3వేల విమానాలను రద్దు చేశారు.భవనాలు కూలిపోయాయి.శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించి హాస్పిటల్ కు తరలించారు

పశ్చిమ ఓహియో నుంచి ఉత్తర అలబామా వరకు ఉన్న కారిడార్ లో తుఫాను బీభత్సం సృష్టించే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్నిరోజులపాటు తీవ్రమైన వెదర్ ఉండే అవకాశముందని,టోర్నడోలు, భీకర గాలులు, వడగండ్ల వాన భీభత్సం సృష్టించే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంట్స్ విల్లే,అలా,నాష్ విల్లే, లూయిస్ విల్లే, సిన్సినాటి,ఇండియానా పోలిస్ లో కూడా వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు.డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఆరు రన్ వేలపైనా మంచు పేరుకుపోయిందని,1300కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.

బుధవారం(మార్చి-13,2019) భారీ మంచు, వాన,భీకర గాలులతో మధ్య అమెరికాను తుఫాన్ వణికించింది. గంటలకు 80 కిలోమీటర్ల వేగంతో బుధవారం గాలులు వీచాయి. తుఫాను ధాటికి కొలరాడో స్టేట్ పాట్రోల్ ట్రూపర్ ఒకరు చనిపోయారు.కొన్ని హైవేలను తాత్కాలికంగా మూసేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చలితో వణికిపోతున్న జనం..ప్రాణాలను కాపాడుకునేందుకు హాస్పిటల్స్ కు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.భయానక వాతావరణం నుంచి కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారు.తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.