Mask పెట్టనన్నాడు.. Corona బారిన పడ్డారు

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 08:13 AM IST
Mask పెట్టనన్నాడు.. Corona బారిన పడ్డారు

Updated On : October 3, 2020 / 9:17 AM IST

Mask : ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా (Corona) మహమ్మారి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పించుకోలేక పోయారు. ఆయనకు కోవిడ్-19 కన్‌ఫామ్ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ట్రంప్ ఉన్నత సలహాదారు హోప్ హిక్స్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.



కోవిడ్-19 (Covid 19) పాజిటివ్ కేసులతో అమెరికా అతలాకుతలం అవుతోంది. మాస్క్ ధరించాలని, వైద్య సిబ్బంది, అధికారులు హెచ్చరించినా ట్రంప్ చాలాసార్లు లెక్కచేయలేదు. విమర్శలు వెల్లువెత్తడంతో వాషింగ్టన్ డీసీలోని ఓ మిలిటరీ ఆసుపత్రి సందర్శన సందర్భంగా మాస్క్ (Mask) ధరించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు.



ఆ తర్వాత కూడా పెద్దగా మాస్క్‌ ధరించలేదు. ట్రంప్‌ మాస్క్‌ ధరించని కారణంగానే వైరస్ సోకినట్టు స్పష్టమవుతోంది. కరోనా ప్రభావిత దేశాల్లో ఆమెరికానే ముందుంది. అలాంటిది అజాగ్రత్తతో వైరస్‌ను ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



ట్రంప్ (Trump) ‌కి లక్షణాలు ఎక్కువగా ఉండగా.. ఆయన భార్య మెలానియాకు మాత్రం తక్కువ సింప్టమ్స్ ఉన్నాయి. 74 ఏళ్ల ట్రంప్‌.. అధిక బరువు లాంటి కారణాలతో కోవిడ్‌-19 రోగుల్లో అధిక ముప్పున్న కేటగిరీగానే పరిగణిస్తున్నారు డాక్టర్లు. అమెరికాలో కరోనా మృతుల్లో 54శాతం మంది పురుషులే. ట్రంప్ బాడీ మాస్ ఇండెక్స్ 30.5గా ఉండడం ఆందోళన కలిగించే అంశమంటున్నారు.



ఐసోలేషన్‌ కావడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగుతూ రెస్ట్‌ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ వైరస్‌ను ఎదుర్కొన్న తీరుకు ఈ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్న క్రమంలో.. ఆయనకు కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది.



ట్రంప్‌కి కరోనా సోకడంతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. కరోనా నిర్ధారణ అంటూ ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మార్కెట్లో సెంటిమెంటు దెబ్బతింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్1.7 శాతం పడిపోయాయి. బంగారం కూడా 0.55 శాతం క్షీణించి.. ఔన్సు ధర 1,894.60 డాలర్లకు చేరుకుంది.



ట్రంప్ కరోనా బారిన పడటంతో ప్రధాని మోదీ స్పందించారు. మిత్రుడు ట్రంప్, ఆయన భార్య త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు ముంచుకొస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ వైరస్ బారిన పడటంతో రిపబ్లికన్ పార్టీ ఆందోళనలో పడిపోయింది.