Donald Trump: మళ్లీ చమురు సంక్షోభం? ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో పెనుమార్పులు? కలకలం రేపుతున్న ట్రంప్ పోస్ట్
ఇరాన్ పై తదుపరి చర్యల గురించి ట్రంప్ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
Donald Trump: ఇరాన్ వైఖరిపై మరోసారి సీరియస్ అయ్యారు ట్రంప్. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు. అణు కార్యక్రమాన్ని విడిచి పెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని, అందుకే చర్చలు విఫలం అయ్యాయని వివరించారు. ఇక ఇరాన్ చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు చిక్కనివ్వమని తేల్చి చెప్పారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రమాదకరం అన్న ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ కు న్యూక్లియర్ పవర్ దక్కనివ్వమన్నారు. మరోవైపు ఇరాన్ కు డబ్బులు చెల్లించిన నౌకలను అంతర్జాతీయ జలాల్లో నిలిపివేస్తామని హెచ్చరించారు ట్రంప్. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్ ను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ట్రంప్ తాజాగా చేసిన పోస్టుతో మళ్లీ చమురు సంక్షోభం రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ తో చర్చలు విఫలం అయితే ఆ దేశ నౌకలను నిర్బంధించే అవకాశం ఉందని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. ఇరాన్ పై తదుపరి చర్యల గురించి ట్రంప్ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు స్తంభిస్తే ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో పెను మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇరాన్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి తమ దారిలోకి తీసుకోవాలని ఒకవైపు భావిస్తుంటే మరోవైపు అది ప్రపంచ చమురు మార్కెట్ లో అస్థిరతకు దారితీస్తుంది. చైనా వంటి దేశాలు ఈ ఆంక్షలను ఎదురించి ముందుకు వెళ్తుండగా భారత్ మాత్రం అటు అమెరికాతో తన సంబంధాలను ఇటు ఇంధన అవసరాలను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ లొంగకపోతే తన దగ్గరున్న ప్రధాన అస్త్రం నౌక దళాలను నిర్బంధించడమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతం ఇచ్చారు.
ఇరాన్ నౌకలను ఉన్న ప్రదేశం నుంచి కదలనివ్వకుండా చేయటం వల్ల చమురు ఎగుమతులపై ఆధారపడిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కానుంది. ఇది ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న మిత్ర దేశాలైన చైనా, భారత్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. వెనిజులా మాజీ అధ్యక్షుడి నికోలస్ మదురోని అమెరికా నిర్బంధించడానికి ముందు కూడా ఇదే విధంగా ఆ దేశంలోని నౌకలను దిగ్బంధించారు. ఆ విజయవంతమైన ప్లాన్ ను ట్రంప్ ఇరాన్ పైనా అమలు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ లో ఇరాన్ తో జరిగిన చర్చలు విఫలమైనట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు.. ఆరోజు నుంచే ప్రారంభం.. యాత్రలో వారికి మాత్రం అనుమతి లేదు..
