రెండు భూకంపాలతో వణికిన జపాన్

వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది.

  • Published By: venkaiahnaidu ,Published On : May 10, 2019 / 02:43 AM IST
రెండు భూకంపాలతో వణికిన జపాన్

Updated On : May 28, 2020 / 3:42 PM IST

వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది.

వరుస భూకంపాలు జపాన్ ని కుదిపేశాయి. జపాన్ లో ఇవాళ(మే-10,2019) రెండుసార్లు భూకంపం వచ్చింది. 5.6, 6.3 తీవ్రతతో దక్షిణ జపాన్ లో శుక్రవారం భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది.

స్థానిక సమయం ప్రకారం శుక్రవారం ఉదయం 7:43గంటలకు 35కిలోమీటర్ల తోతులో 5.6 తీవ్రతతో మొదటి భూకపం వచ్చింది.ఆగ్నేయ మియాజకి-షికి తూర్పున 44కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. 8:48 గంటల సమయంలో 24 కిలోమీటర్ల లోతులో 6.3 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.

ఆగ్నేయ మియాజకి-షికి తూర్పున 37కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జీఎస్ తెలిపింది. అయితే భూకంపాల కారణంగా జరిగిన ఆస్తినష్టం, ప్రాణ నష్టం గురించి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. 
Also Read : OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి