Delta Airlines Plane : డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్‌లో మంటలు, ఒకరికి గాయాలు
డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలి మంటలు చెలరేగిన ఘటన సంచలనం సృష్టించింది.....

Delta Airlines Plane
Delta Airlines Plane : డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలి మంటలు చెలరేగిన ఘటన సంచలనం సృష్టించింది. (Tyre Of Delta Airlines Plane Bursts) వర్జీనియా నగరం నుంచి 190 మంది ప్రయాణికులతో బోయింగ్ 757 విమానం సాయంత్రం 6 గంటలకు హార్ట్‌ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగింది.
Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్, ముగ్గురు సైనికుల మృతి
దీంతో ఎమర్జెన్సీ వాహనాలు విమానాన్ని చుట్టుముట్టినట్లు కనిపించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తక్షణమే వైరల్ అయ్యాయి. విమానంలో నీటిని చల్లడానికి అత్యవసర వాహనాన్ని కూడా ఉపయోగించారు. విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయడానికి గాలితో కూడిన స్లయిడ్‌ను ఉపయోగించారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికుడి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. డెల్టా బోయింగ్ 757 విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన తర్వాత ఎడమ టైరు ఊడి మంటలు చెలరేగాయి.
Passengers were forced to evacuate a #Delta Boeing 757 (N767DL) after it landed at #Atlanta today at 5:37 p.m. Flight #DL1437 took off from #Richmond. The left main gear tire blew during landing, which sparked a fire.
🎥 ©Mike Russell | 📷 ©Bruce Campbell | ©Jean Druckenmiller pic.twitter.com/5libGzQtT7
— FlightMode (@FlightModeblog) August 3, 2023