food in Bush : పిల్లల కోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తల్లి..‘మీ ఫుడ్‌ని చెత్తలో పడేశా..వెళ్లి తెచ్చుకోండి అన్న డెలివరీ బాయ్

ఆకలేస్తోందని పిల్లలు ఏడుస్తుంటే ఓ తల్లి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ చేసిన ఫు డ్ ను తెచ్చిన డెలివరీ బాయ్ ఫుడ్ ని చెత్తలో పారేసి..వెళ్లి తెచ్చుకోండి అని చెప్పాడు.

food in Bush : పిల్లల కోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తల్లి..‘మీ ఫుడ్‌ని చెత్తలో పడేశా..వెళ్లి తెచ్చుకోండి అన్న డెలివరీ బాయ్

Food Dumped In Bush

Updated On : November 6, 2021 / 2:27 PM IST

food Dumped in BUSH : ఆకలి వేస్తే వండుకుని తినేంత ఖాళీ లేదు. అమ్మా ఆకలేస్తోంది అంటే ‘ఐదు నిమిషాలు నాన్నా..అంటూ తల్లి ఒక్క క్లిక్ తో ఆరడ్ చేసేస్తున్నారు. అలా పిల్లలు ఆకలని అడిగారని ఓ తల్లి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. ఆర్డర్‌ పెట్టిన తర్వాత తన అడ్రస్‌ కాకుండా తన ఫ్రెండ్ ఇంటి అడ్రస్ ఇచ్చింది. తరువాత తన పొరపాటు గుర్తించింది. వెంటనే డెలివరీ బాయ్ తను ఇచ్చిన అడ్రస్ కు వెళతాడని కంగారుపడింది. వెంటనే డెలివరీ బాయ్ కు ఫోన్ చేసింది. ‘‘సారీ పొరపాటున తన ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చాను..ఆర్డర్‌లో ఉన్న అడ్రస్‌కు కాకుండా.. తన ఇంటికి ఫుడ్‌ తీసుకురమ్మని కోరింది. దానికి డెలివరీ బాయ్ ఫైర్ అయ్యాడు. మీ ఇష్టమొచ్చినట్లు అడ్రస్ మారిస్తే నేను తిరగాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఊరుకోకుండా ‘మీ ఫుడ్ చెత్తలే పారేసాను కావాలంటేతెచ్చుకోండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

Read more : ఫుడ్ ఆర్డర్ చేసిన చిన్నారి..ఇంటిముందు క్యూ కట్టిన 30మంది డెలివరీ బాయ్స్

జీనెట్ ఎరిక్సన్-గ్రే అనే 39 ఏళ్ల మహిళ తన ఏడేళ్ల కూతురు కోసం ఉబర్‌ ఈట్స్‌లో మెక్‌డోనాల్డ్స్‌ హ్యాపీ మీల్స్‌ ఆర్డర్‌ చేసింది. డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్‌లో తన ఇంటి అడ్రస్ కు బదులు..తన ఫ్రెండ్‌ అడ్రస్‌ ఉన్నట్లు గుర్తించి..వెంటన్‌ డెలివరీ బాయ్‌కు కాల్‌ చేసి.. అడ్రస్‌ కాకుండా తన చెప్పే అడ్రస్ కు తీసుకురావాలని కోరింది. దానికి డెలివరీ బాయ్‌ ఒప్పుకోలేదు. ‘‘మొదట ఇచ్చిన అడ్రస్‌కే ఆర్డర్‌ తీసుకువచ్చి ఇస్తాను అన్నాడు. కావాలంటే మీరే మీ స్నేహితురాలి ఇంటికి రండి’’ అని తెలిపాడు. అందుకు ఆ మహిళ బయట వ‍ర్షం కురుస్తెంది. ఆర్డర్‌లో ఉన్న అడ్రస్‌కు మా ఇల్లు చాలా దగ్గరే ఉంది.. దయచేసి డెలివరీ ఇక్కడకు తీసుకురండి.. డబ్బులు ఎక్స్‌ట్రా ఎంత అంటే అంత ఇస్తాను అని బతిమాలు తన ఇంటి అడ్రస్‌ని మెసేజ్ చేసింది. కానీ డెలివరీ బాయ్‌ అందుకు ససేమీరా అన్నాడు.

ఆ తర్వతా సదరు డెలివరీ బాయ్‌ జీనెట్‌కు ఓ ఫోటో షేర్‌ చేశాడు. మీ ఆర్డర్‌ని ఇక్కడ పడేశాను.. వెళ్లి తీసుకోండి అని మెసేజ్‌ చేశాడు. పాపం జీనెట్ ఇక చేసేదేం లేక జీనెట్‌ తన పిల్లలను తీసుకుని.. డెలివరీ బాయ్‌ పంపిన ఫోటోలోని చోటకు వెళ్లింది. కానీ అక్కడ వారికి తాము ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ కనిపించలేదు. డెలివరీ బాయ్ సెండ్ చేసిన లొకేషన్ కు వెళ్లి చూడగా..రోడ్డు పక్కన చెత్తలో తాను ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ని పడేసి ఉంది. చేసేదేం లేక పాపం ఆమె పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఫుడ్ పడేసి ఉన్న ప్లేస్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైలర్ గా మారింది.

Read more : ప్రపంచంలోనే కాస్ట్లీ : ప్లేటు బిర్యానీ రూ.20 వేలు..!!

దీంతో ఆమె బాధపడింది. కష్టమర్ల విషయంలో ఇలా వ్యవహరిస్తారా? అంటూ జీనట్‌ ఉబర్‌ యాప్‌లో ఫిర్యాదు చేసింది. నాకు ఫుడ్ అందజేయనప్పుడు నా డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని కోరింది. కానీ వారు ఒప్పుకోలేదు. దీంతో ఆమె జరిగిన సంఘటన గురించి జీనట్‌ సోషల​ మీడియాలో షేర్‌ చేయగా.. సదురు డెలివరీ బాయ్‌ని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. వ్యవహారం కాస్త ముదరడంతో ఉబర్‌ యాజమాన్యం దీనిపై దిగి వచ్చింది. ‘‘మా డెలివరీ బాయ్‌ ప్రవర్తించిన తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం.

జీనట్‌కు క్షమాపణలు తెలుపుతున్నాం. ఆమె డబ్బులను పూర్తిగా తిరిగి ఇవ్వడమేకాక.. ఉబర్‌ ఈట్స్‌ క్రెడిట్‌ని జీనట్‌కు టిప్‌గా ఇస్తున్నాం’’ అని తెలిపింది. కానీ జీనట్‌ మాత్ర మళ్లీ జన్మలో ఉబర్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయనని ఖరాకండీగా చెప్పేసింది. కాగా ఫుడ్ విషయంలో డెలివరీ బాయ్ చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటు అని ఆమె చెప్పినా అలా చేయటం ఏంటీ అంటున్నారు. పిల్లలు ఆకలితో ఉన్నారు..ఎక్స్ ట్రా డబ్బులు కూడా ఇస్తానని అలా చేయటం దారుణం అంటున్నారు.