భారత్ దౌత్య విజయం : మసూద్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.

  • Published By: venkaiahnaidu ,Published On : May 1, 2019 / 01:45 PM IST
భారత్ దౌత్య విజయం : మసూద్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

Updated On : May 28, 2020 / 3:41 PM IST

దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది.

దౌత్యపరంగా భారత్ అతిపెద్ద విజయం సాధించింది.భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను బుధవారం(మే-1,2019) ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షల కమిటీ కింద మసూద్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రతిపాదనకు చైనా  అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది.ఐక్యరాజ్యసమితిఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పాక్‌ కూడా స్పందించింది. మసూద్ కి గ్లోబల్‌ టెర్రరిస్ట్ ట్యాగ్ ఇవ్వడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
Also Read : నాపై చర్యలు తీసుకుంటే ఖబడ్డార్ : పాక్ కు.. టెర్రరిస్ట్ మసూద్ వార్నింగ్

చిన్నా,పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో సహకరించిన అన్ని దేశాలకు కృతజ్ణతలు తెలుపుతున్నట్లు భారతీయ అంబాసిడర్ మరియు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో మసూద్ ఆస్తులు ఇతరత్రా విదేశాల్లో ఉంటే జప్తు చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు.మసూద్ అజార్ తమ దేశంలోనే సురక్షితంగా ఉన్నాడని ఇటీవలే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అంగీకరించిన విషయం తెలిసిందే.

మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని కొన్నేళ్లుగా భారత్ దౌత్యప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.అయితే ఎప్పటికప్పుడు భారత్ ప్రతిపాదనను చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంటూ వచ్చింది.అయితే పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించే విషయంలో భారత్ మరింత స్పీడ్ పెంచింది.అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ దేశాల ఒత్తిడితో భారత స్పీడ్ కి చైనా అడ్డుతగలకపోవడంతో ఎట్టకేలకు మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది.టెర్రరిజమ్ పై పోరాడేవాళ్లకు ఇది మంచి రోజు అని భారత్ ప్రకటన చేసింది.

Also Read : షాకిచ్చిన లండన్ కోర్టు : అసాంజేకు 50 వారాల జైలుశిక్ష