పాకిస్తాన్ విమానాల‌పై అమెరికా నిషేధం

  • Published By: vamsi ,Published On : July 10, 2020 / 01:55 PM IST
పాకిస్తాన్ విమానాల‌పై అమెరికా నిషేధం

Updated On : July 10, 2020 / 3:10 PM IST

అమెరికాకు చార్టర్ విమానాలు నడపడానికి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ) అనుమతి రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్ పైలట్ల ధృవీకరణకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఎఎఎ) ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. పాకిస్తాన్ గత నెలలో జరిపిన దర్యాప్తులో మూడింట ఒక వంతు పైలట్లు తమ అర్హత కేసులను తారుమారు చేశారని కనుగొన్నారు.

యూరోపియన్ యూనియన్ నిషేధం:
యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఇప్పటికే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ క్యారియర్ కార్యకలాపాలను ఆరు నెలల పాటు నిషేధించింది. మూడు విమానాశ్రయాలలో పిఎఐలను బ్రిటన్ నిషేధించగా, వియత్నాం దేశంలో పనిచేస్తున్న పాకిస్తాన్ పైలట్లందరినీ నిషేధించింది.

అదేవిధంగా పాకిస్తాన్ లైసెన్స్ పొందిన పైలట్లను మలేషియా కూడా తాత్కాలికంగా నిషేధించింది. పాకిస్తాన్ సిబ్బందిపై యుఏఈ కూడా దర్యాప్తు ప్రారంభించింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అమెరికా ఫ్లైట్‌లు నిలిపివేయడంపై ఇంకా ఏం మాట్లాడలేదు.

మేలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం విమానాశ్రయంలో దిగేటప్పుడు కూలిపోయి 97 మంది మరణించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పైలట్ల అర్హత గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఉగ్రవాదంతో సహా పలు అంశాలపై ప్రపంచంలో తన ఇమేజ్‌ను తీవ్రంగా కోల్పోతున్న పాకిస్థాన్‌కు ఇది మరో మచ్చ. నకిలీ మరియు ప్రశ్నార్థకమైన లైసెన్సుల కారణంగా ప్రభుత్వ సంస్థ ఇప్పటికే తన పైలట్లలో మూడవ వంతును తొలగించింది.

ఆ దేశంలోని 860 యాక్టివ్ పైలట్లలో 262 లైసెన్సులు నకిలీవని తేలగా.. వారు మోసం చేసి పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు గుర్తించారు. వీరిలో సగానికి పైగా పిఐఎ పైలట్లు ఉన్నారు. ఇక 434 పైలట్లలో 141 మందిని సంస్థ వెంటనే తొలగించింది. కరోనా వైరస్ ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది.