Kamala Harris: కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి జిల్లా పాల్వంచలో యాగం

తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలోనూ కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ యాగం నిర్వహించారు. కమలా హారిస్ తల్లి పేరుమీద స్థాపించిన శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

Kamala Harris: కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి జిల్లా పాల్వంచలో యాగం

US Elections 2024

Updated On : November 5, 2024 / 2:27 PM IST

US Elections 2024: అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షులు ఎవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభ మవుతుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ లు బరిలో ఉన్నారు. కమలా హారిస్ తమిళ మూలాలున్న భారత సంతతి మహిళ. దీంతో ఆమె విజయం సాధించాలని కాంక్షిస్తూ ఇప్పటికే భారత్ లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read: US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన హిప్పో “మూ డెంగ్”

కమలా హారిస్ పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ఆమె ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాక.. ఆమె విజయం సాధించాలని, అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆ గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలోనూ ఆమె విజయాన్ని కాంక్షిస్తూ యాగం నిర్వహించారు. కమలా హారిస్ తల్లి పేరుమీద స్థాపించిన శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో శ్రీశ్రీశ్రీ రాజ శ్యామలంబ సుదర్శన మహాయజ్ఙం నిర్వహించారు.

Also Read: US Election 2024: అమెరికా అధ్యక్షుడికి జీతమెంత వస్తుందో తెలుసా..? ఎలాంటి సౌకర్యాలు అందుతాయంటే..

శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ సొసైటీని చైర్మన్ గా నల్లా సురేశ్ రెడ్డి ఉన్నారు. తాను కొంతకాలం అమెరికాలో పనిచేశానని, ఆ సమయంలో సెనేటర్ గా ఉన్న కమలా హారిస్ ను కలిశానని , భారతీయ మూలాలు కలిగిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ గురించి తెలుసుకొని ఆమె పేరుతో పాల్వంచలో ఫౌండేషన్ సొసైటీ స్థాపించడం జరిగిందని తెలిపాడు. త్వరలో కమలా హారిస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చైర్మన్ తెలిపాడు.