Afghanistan : కాబూల్ ఎయిర్ పోర్ట్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా

తాలిబన్లు అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిందని..తాము విజయం సాధించామని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు

Afghanistan : కాబూల్ ఎయిర్ పోర్ట్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా

Kabul (1)

Updated On : August 16, 2021 / 3:22 PM IST

Afghanistan తాలిబన్లు అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిందని..తాము విజయం సాధించామని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు. అయితే తాలిబన్ల రాజ్యంలో బతకలేమని భావించిన పెద్ద సంఖ్యలో అఫ్ఘాన్లు దేశం వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ అఫ్గాన్​ను వదిలి వెళ్లారనే వార్త తెలియగానే ప్రజలంతా ఉక్కిరి బిక్కిరయ్యారు..ఆదివారం రాత్రి నుంచి వేల మంది నగరవాసులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రి తీసుకొని దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకొన్నారు. దీంతో కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది.

వేలమంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అంతేకాదు అమెరికా దౌత్య ఉద్యోగులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు తరలించింది. అయితే ప్రజలు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న అమెరికా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఐదురుగు పౌరులు ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్​లో గగనతలాన్ని అధికారులు మూసేశారు. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి కూడా విమానాలు నిలిపి వేసినట్లు ప్రకటించారు. రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్ఘానిస్తాన్ లోని అమెరికా బలగాలు… కాబూల్ ఎయిర్ పోర్ట్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అఫ్ఘాన్ లో ఉన్న అమెరికన్లు మరియు దాని మిత్రులను సురక్షితంగా దేశం దాటించేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి అమెరికా బలగాలు. అమెరికా..తమ దౌత్య ఉద్యోగులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు తరలించింది. ఇక, భారత్ సహా,ఇతర దేశాలు కూడా అప్ఘాన్ లోని తమ పౌరులను స్వదేశాలకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే ఇంకా అక్కడ ఉన్న తమ తమ దేశాల పౌరులను తిరిగి తీసుకొచ్చేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్న క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేయబడటంతో…పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ప్రజలు విమానాల రాక కోసం ఎదరుచూస్తున్నారు.

బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ మాట్లాడుతూ … కాబూల్ విమానాశ్రయం వాణిజ్య భాగంగా(ది ఎక్కువగా ఆగిపోయింది),మరియు మిలటరీ భాగంగా(ఇది ఇప్పుడు సేఫ్ గా ఉంది మరియు వివిధ దేశాల సిబ్బందిని తరలిస్తోంది) విభజించబడిందన్నారు. కాగా,ఈ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి అమెరికా 6,000 మంది సైనికులను అక్కడికి పంపింది.