Rodney James Alcala : 130 మందిని హత్య చేసిన ‘డేటింగ్‌ గేమ్‌ కిల్లర్‌’ మృతి

103 హత్యలు చేసిన నరరూప రాక్షసుడు... ‘డేటింగ్‌ గేమ్‌ కిల్లర్‌’గా పేరొందిన ‘రోడ్నీ జేమ్స్ అల్కల’ జైలులో మృతి చెందాడు. రెండు సార్లు మరణశిక్ష పడినా కొన్ని కారణాలతో శిక్ష అమలు జరగకపోయినా గానీ ఈ నరరూప రాక్షసుడు మృతి చెందాడు.

Rodney James Alcala : 130 మందిని హత్య చేసిన ‘డేటింగ్‌ గేమ్‌ కిల్లర్‌’ మృతి

Us The Dating Game Killer Rodney James Alcala Dead

Updated On : July 26, 2021 / 4:42 PM IST

US “The Dating Game Killer Rodney James Alcala Dead: వాడొక నరరూప రాక్షసుడు. హత్యలు చేయటం అంటే వాడికి చాలా చాలా తేలిక.చిన్న పిల్లలని కూడా చూడడు. గర్భిణిలను కూడా వదలని కర్కోటకుడు. అలా ఒకటీ రెండూ కాదు 10 ,20 కాదు ఏకంగా 103మందిని అత్యంత దారుణంగా హత్య చేసిన కిరాతకుడు ‘రోడ్నీ జేమ్స్ అల్కల’. వయస్సు 77 ఏళ్లు. ఈ రాక్షసుడు ‘డేటింగ్‌ గేమ్‌ కిల్లర్‌’గా పేరొందాడు. అంతటి కిరాతకుడికి రెండు సార్లు మరణశిక్ష విధించారు. కానీ ఇంతలోనే జైలులోనే చనిపోయాడు ‘డేటింగ్‌ గేమ్‌ కిల్లర్‌’ రోడ్నీ జేమ్స్ అల్కల. కాలిఫోర్నియా జైలులో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న.. అల్కల శనివారం (జులై 25,2021) మరణించాడని జైలు అధికారులు తెలిపారు.

కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఆసుపత్రి సహజ కారణాలతోనే అల్కల మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలీఫోర్నియాలో ఐదుగురిని హత్య చేసిన నేరాలకు అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ ఐదుగురిలో 12 ఏళ్ల చిన్నారి కూడా వదల్లేదు అల్కల. అంతటి కర్కోటకుడు.అల్కల ఎంతటి దారుణ హత్యలు చేశాడో ఆ హత్యల గురించి తెలుసుకుంటూ ఇతడికి ఉరి కాదు నడిరోడ్డుమీద నరికి చంపాలనిపిస్తుంది. అమెరికా వ్యాప్తంగా 130 మందిని హత్య చేసాడని అధికారులు భావించారు.2013లో న్యూయార్క్‌లో మరో ఇద్దరిని నరహత్య చేసినందుకు గాను అల్కలాకు అదనంగా మరో 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. 1977 మృతుల్లో వ్యోమింగ్‌ ప్రాంతంలో లభించిన ఓ 28 ఏళ్ల మహిళ మృతదేహానికి సంబంధించిన కేసులో డీఎన్‌ఏ ఆధారంగా అల్కలా ప్రమేయం వెలుగు చూడటంతో అతడికి 2016లో మరోసారి శిక్ష వేశారు. ఆరు నెలల గర్భవతి హత్య కేసులో అల్కలపై ఇంకా విచారణ కొనసాగుతుండగానే జైలులో మరణించాడు.

ఉరి శిక్ష విధించినప్పటికి అల్కల ఆరోగ్య కారణాల రీత్యా జైలులో కంటే అతడి ఇంటిలోనే ఎక్కువ కాలం ఉన్నాడు.గావిన్ న్యూసోమ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్న సమయంలో అల్కల ఉరిశిక్షపై తాత్కాలిక నిషేధం విధించారు. అధికారులు.. అల్కల తాను హత్య చేసిన మహిళల చెవిపోగులను తీసుకునేవాడని తెలిపారు. గతంలో అల్కల ధరించిన బంగారు చెవి రింగులు తన కుమార్తె రాబిన్‌ సామ్సోవేనని ఈ కేసులో ఓ మహిళ సాక్ష్యం ఇచ్చింది. అప్పుడే అతను ధరించిన చెవిపోగుల గురించి వెలుగులోకి వచ్చింది.కానీ అల్కలా మాత్రం చెవిపోగులు నావేనని..వాటిని తనవేనని..అవి నా దగ్గర ఎప్పటినుంచో ఉంటున్నాయనీ కావాలంటే 1978 లో నేను ‘ది డేటింగ్ గేమ్‌’ టీవీ షోలో కనిపించిన క్లిప్‌ని చూపించాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే సామ్సో చనిపోవడానికి సంవత్సరం ముందే తాను ఈ బంగారు చెవి పోగులను ధరించానని అల్కలా కోర్టుకు చెప్పి ఇవి నామీద ఆమె చేసిన ఆరోపణలని ఇవి ఎంతమాత్రం నిజంకాదని వాదించాడు.

దర్యాప్తు చేసిన అధికారులు ఒక బాధితురాలి డీఎన్‌ఏ.. అల్కలా దగ్గర ఉన్న గులాబీ రంగు చెవి పోగులో గుర్తించడమే కాక.. సామ్సో శరీరంలో అల్కలా డీఎన్‌ఏ గుర్తించారు. ఈ కేసులో అతడికి రెండు సార్లు మరణశిక్ష విధించారు. కాని రెండు నేరారోపణలు తారుమారు చేయబడ్డాయి. రెండు దశాబ్దాల తరువాత, కొత్త డీఎన్‌ఏ, ఇతర ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా, నలుగురు మహిళల హత్యలకు సంబంధించి అల్కలాపై అభియోగాలు వచ్చాయి. తీర్పు తరువాత, అధికారులు అల్కాలా ఆధీనంలో ఉన్న యువతులు, బాలికల కి చెందిన100 కి పైగా ఫోటోలను విడుదల చేశారు. కాగా..1978 లో టెలివిజన్ షో “ది డేటింగ్ గేమ్” లో పోటీదారుగా ఉన్నందున అల్కలాను “డేటింగ్ గేమ్ కిల్లర్” అని పిలుస్తారు.