China: మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడిన చైనా.. ఇప్పుడు 42 యుద్ధ విమానాలతో..

తైవాన్ ఎన్నికల వేళ చైనా మరోసారి యుద్ధ విమానాలు పంపడంతో దీనిపై అమెరికా స్పందించింది. చైనా చర్యలను..

China: మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడిన చైనా.. ఇప్పుడు 42 యుద్ధ విమానాలతో..

China

China – Taiwan: తైవాన్ సరిహద్దుల చుట్టూ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. దాదాపు 40 యుద్ధ విమానాలతో తైవాన్ గగనతల రక్షణ జోన్‌లోని ప్రవేశించి కలకలం రేపింది. వాటిలో 26 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థరేఖను దాటాయి. వీటిని సైనిక విన్యాసాలుగా చైనా పేర్కొంది.

తైవాన్ వేర్పాటువాదులు, విదేశీ శక్తులకు వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. యుద్ధ సన్నద్ధ సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికే ఈ విన్యాసాలు చేపట్టినట్లు తెలిపింది. చైనా చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తైవాన్ మండిపడింది. తైవాన్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో జోక్యం చేసుకోవాలని చైనా విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.

అటువంటి ప్రయత్నాలు చేయడం సరికాదని తైవాన్ కూడా హెచ్చరించింది. సరిహద్దుల్లో భూ, వాయు, సముద్రతలాల్లో చైనా గస్తీని పెంచింది. తైవాన్ ఎన్నికల వేళ చైనా మరోసారి యుద్ధ విమానాలు పంపడంతో దీనిపై అమెరికా స్పందించింది. చైనా చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తైవాన్‌తో అర్థవంమైన చర్చలు జరపకుండా.. మిలిటరీ, దౌత్యపర, ఆర్థికపరంగా ఒత్తిడి తీసుకురావడం సరికాదని, ఈ తీరును మానుకోవాలని అమెరికా చెప్పింది.

Russia Luna25: జాబిలిని అందుకోలేకపోయిన రష్యా.. కుప్పకూలిన లూనా-25.. ఇక చంద్రయాన్-3?