India Pakistan War: భారత్, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన

భారత్ - పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

India Pakistan War: భారత్, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన

US Vice President JD Vance

Updated On : May 9, 2025 / 10:58 AM IST

India Pakistan War: భారత దేశం – పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉగ్రమూకలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లపైకి వాటిని వదిలింది. అయితే, భారత్ సైన్యం పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎనిమిది డ్రోన్లు, మూడు ఫైటర్ జెట్లను కూల్చేసింది. మరోవైపు పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది.

Also Read: India Pakistan Tensions: భారత్ దెబ్బకి పారిపోయిన పాకిస్తాన్ ప్రధాని..! షెహబాజ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు..!

పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే దోరణులు అవలంభిస్తుండటంతో భారత ప్రభుత్వం దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలను మూసివేయగా.. ఢిల్లీలో 90కిపైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సమాచారం.

Also Read: INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కరాచీ సీ పోర్ట్ పై భారత నేవీ భీకర దాడులు, పోర్టు ధ్వంసం

భారత్ – పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. ‘‘అమెరికా ప్రభుత్వం భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఆందోళన చెందుతోందని తెలిపారు. ఈ రెండు అణ్వస్త్ర శక్తుల మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. “అణ్వస్త్ర శక్తులు ఘర్షణకు దిగినప్పుడు మేము ఆందోళన చెందుతాము. ఈ ఉద్రిక్తతలు వీలైనంత త్వరగా తగ్గాలని మేము కోరుకుంటున్నాము. మేము ఈ దేశాలను నియంత్రించలేము, ఎందుకంటే భారతదేశానికి పాకిస్తాన్‌పై, పాకిస్తాన్‌కు భారతదేశంపై కంప్లైంట్లు ఉన్నాయి” అని వాన్స్ అన్నారు. ఆయుధాలు వదిలివేయమని అమెరికా ఈ రెండు దేశాలకూ చెప్పలేదన్న ఆయన.. దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడం ఏకైక ఎంపిక అని తెలిపారు.

ఇదిలాఉంటే.. జేడీ వాన్స్‌ తన కుటుంబంతోపాటు భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.