Guinness World Record: ఆమెతో పెట్టుకోవద్దు..మజిల్స్ తో పిప్పి చేసిపారేస్తది..

చేతులతోనే దోసెల పెనంను పేపర్‌ను మడిచినట్టు మడిచేస్తుంది. దోసెల పాన్ ని రబ్బరులా వంచేస్తుంది. 10కి పైగా యాపిల్స్‌ను ఒక్క నిముషంలో పగులగొట్టి గిన్నీస్ రికార్డు సృష్టించింది

Guinness World Record: ఆమెతో పెట్టుకోవద్దు..మజిల్స్ తో పిప్పి చేసిపారేస్తది..

Linsey Lindberg Most Apples Crushing Guinness World Record

Updated On : November 16, 2021 / 4:19 PM IST

Linsey Lindberg Most Apples Crushing Guinness World Record: ఆమె అందం చూస్తే చూపు తిప్పుకోలేం. నాజూకుగా..కోమలంగా..ముగ్ధ మనోహరంగా కనిపించే ఆమెతో పెట్టుకుంటే మహామహ వస్తాదులు కూడా గింగిరాలు తిరగాల్సిందే. ఎవరన్నా ఆమెతో వెర్రి వేషాలు వేస్తే వారికి మూడినట్లే..ఆమె మజిల్స్ మధ్య ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు. ఇక చచ్చినట్లే. పప్పి చేసిన పారేస్తుంది…ఎందుకంటే ఆమె మజిల్స్ అంత స్ట్రాంగ్. ఆమె స్ట్రాంగ్ మజిల్స్ తో ఆమె చేసే అడ్వంచర్స్ అన్నీ ఇన్నీ కావు. అందుకే గిన్నీస్ బుక్ రికార్డు వారు కూడా నీ మజిల్స్ స్ట్రాంగ్ కు ఫిదా అన్నారు. వరల్డ్ రికార్డునిచ్చి గుర్తించారు.

Read more : World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..

ఆ ఐరన్ లేడీ పేరు లిన్సే లిండ్‌బర్గ్. కానీ ‘మామా లూ’ అనే స్టేజ్‌ నేమ్‌తో అమెరికాలో ఫుల్ ఫేమస్‌. ఎందుకంటే..కేవలం చేతులతోనే దోసెల పెనంను పేపర్‌ను మడిచినట్టు మడిచేస్తుంది. దోసెలు వేసుకునే పాన్ కూడా రబ్బరులా వంచేస్తుంది. ఇంత లావు ఉండే టెలిఫోన్ డైరెక్టరీల్ని ఏదో చిత్తుకాగితాన్ని చింపినట్లుగా ముక్కలు ముక్కలు చేసి పారేస్తది.

ఇక యాపిల్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆమె మజిల్స్ మధ్యలో యాపిల్స్ గుక్కపట్టి ఏడుస్తాయంటే నమ్మండి. ఎందుకంటే ఆమె మజిల్స్ మధ్యలో యాపిల్స్ పెట్టుకుని పిండి చేసి పారేస్తది. మోచేయి మధ్యలో యాపిల్ ఉంచి.. పిండిచేసేస్తుంది. అలా 10కి పైగా యాపిల్స్‌ను కేవలం ఒక్క నిముషంలోనే ఫట్‌.. ఫట్‌.. మని పగులగొట్టి ఏకంగా గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకుంది.

Read more : 3 రోజుల 14 గంటల్లో ప్రంపంచాన్ని చుట్టేసి గిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళ

అంతేకాదు ఒక నిమిషంలో 5 డెక్‌ల కార్డ్‌లను చించేసింది. ఇక టెలిఫోన్ డైరెక్టరీలు ఆమె చేతిలో చిత్తుకాగితం కిందే లెక్క. దాన్ని పట్టుకోవటానికి మనం కిందామీద పడతాం. కానీ ఆమె మాత్రం అంతలాపు పుస్తకాన్ని ఏదో చిన్నకాగితాన్ని చింపినట్లుగా నిలువుగాను అడ్డంగాను చింపి పారేస్తది. ఒక నిమిషంలోనే సగానికి చింపిన రికార్డులు కూడా లిన్సే లిండ్‌బర్గ్ ఖాతాలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. నెట్టింట స్ట్రాంగెస్ట్‌ మహిళ లిన్సే లిండ్‌బర్గ్ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.