18 నెలల్లో కరోనాకు మందు కనిపెడతాం: WHO

18 నెలల్లో కరోనాకు మందు కనిపెడతాం: WHO

Updated On : February 12, 2020 / 3:47 AM IST

చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ మందు గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నా వాటిల్లో ఏ ఒక్కటి నిజం లేదు. ఈ మేర వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ 18నెలల్లో మందు కనిపెడతామని చెప్తుంది. ‘ప్రస్తుతం మన దగ్గరున్న వాటితో ప్రతీది చెయ్యాలి’ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెండ్రాస్ అద్నామ్ ఘెబ్రిసియోస్ జెనీవాలో జరిగిన సదస్సులో మంగళవారం వెల్లడించాడు. 

ఇకపై నుంచి కొత్త కరోనా వైరస్ (Covid-19)అని పేరుతో పిలవాలంట ఇదే సదస్సులో టెండ్రాస్ అద్నామ్ ఘెబ్రిసియోస్ మీడియాకు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడంతో 1000కు పైగా మృతిచెందారు. 10 వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది. ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారిని సాధ్యమైనంత తొందరగా నిరోంధించాల్సిన అవసరం ఉందని అద్నామ్ సూచించారు. 

కరోనా వైరస్ అనే పదం.. జాతికి బదులుగా ఒక వైరస్ సమూహాలను చెందినదిగా సూచిస్తుంది. వైరస్ వర్గీకరణలపై కరోనా వైరస్.. SARS-CoV-2గా అంతర్జాతీయ కమిటీ వర్గీకరించింది. ప్రాణాంతక వైరస్‍‌లు ఎన్నో ప్రబలుతున్నాయి. ఒక్కో వైరస్ ఒక్కో శాస్త్రీయ నామం ఉంటుంది. ఆ వైరస్ జాతి బట్టి వర్గీకరిస్తుంటారు పరిశోధకులు. వైరస్ పేర్లపై ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు రీసెర్చర్లు అధికారిక పేరుతో పిలుస్తున్నారు.

అదే Covid-19 అనే కొత్త పేరు పెట్టారు. జీయోగ్రాఫికల్ లొకేషన్ సూచించకుండా ఉండేలా ఒక పేరును కనిపెట్టారు. ఒక జంతువు పేరు కానీ లేదా వ్యక్తగతంగా లేదా మనుషుల పేర్లతో సరిపోలకుండా ఉండేలా ఈ పేరు పెట్టారు. వైరస్ కు సంబంధించి ఉండేలా సులభంగా పలికేలా వైరస్ పేరు పెట్టడం జరిగిందని WHO చీఫ్ తెలిపారు.