కరోనా మొదట ఎవరికి సోకింది..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?
భయంకరమైన కరోనా వైరస్ మొదట ఎవరికి సోకింది..? ఆ పేషెంట్ ఎవరు..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?

భయంకరమైన కరోనా వైరస్ మొదట ఎవరికి సోకింది..? ఆ పేషెంట్ ఎవరు..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?
ప్రపంచానికే వైరస్ అంటించిందని వుహాన్ మార్కెట్‌కి పేరు పడిందిప్పుడు. కరోనాకి పుట్టిల్లుగా కూడా వుహాన్‌కి పేరు. మరి వుహాన్ మార్కెట్లో పుట్టిన ఈ భయంకరమైన వైరస్ మొదట ఎవరికి సోకింది..? ఆ పేషెంట్ ఎవరు..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?
ప్రపంచం మీద దండెత్తిన కరోనా
బహుశా అమెరికా అధ్యక్షుడు ట్రంప్..తిరిగి తాను ఎలా ఎన్నిక కావాలా అనే ప్లాన్‌లో ఉండి ఉంటారు. బ్రిటన్ ప్రధాని బ్రెగ్జిట్ గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటారు. సౌత్ కొరియా అధ్యక్షుడు ఈసారి ఏ గుర్రంపై స్వారీ చేయాలా అని స్కెచ్ వేస్తుండొచ్చు. అలా ప్రపంచ దేశాధినేతలంతా తమ పనుల్లో వ్యూహాల్లో బిజీగా ఉండగా…ఎవరికీ తెలీకుండా..సైలెంట్‌గా ప్రపంచం మీద దండెత్తే ఓ వైరస్ పుట్టుక ప్రారంభమైంది.
డిసెంబర్ 16 కరోనా ప్రాణాంతక వైరస్‌గా నిర్ధారణ
అది వుహాన్‌లోని హువానాన్ సీ ఫుడ్ మార్కెట్…వేగుఇగ్జియాన్ అనే మహిళ రోజూలాగే మార్కెట్‌లో చేపలు రొయ్యలు అమ్ముకుంటోంది. ఆ రోజే ఆమెకి కాస్త జలుబు చేయగా..లోకల్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి డాక్టర్ ఆమెకి ఓ ఇంజెక్షన్ ఇచ్చి పంపేశాడు. అయితే ఆమె ఇంకా బలహీనంగా అన్పించడంతో వుహాన్‌లోనే ఎలెవెంత్ హాస్పటల్‌కి వెళ్లింది. ఇంకా ఆమె జలుబు..శరీరంలోని అలసట తట్టుకోలేని స్థాయికి చేరడంతో..వుహాన్ యూనియన్ హాస్పటల్‌కి ట్రీట్‌మెంట్ కోసం వెళ్లింది. అప్పటికి ఆమెకి వైరస్ సోకి ఆరు రోజులైంది. అంటే అది డిసెంబర్ 16..వుహాన్ యూనియన్ హాస్పటల్ సిటీలోనే పెద్ద వైద్యశాల. అక్కడి వైద్యులు వేగుఇగ్జియాన్‌కు సోకింది ప్రాణాంతకమైన వైరస్‌గా నిర్ధారించారు.
కరోనా తొలి పేషెంట్‌గా వేగుఇగ్జియాన్ గుర్తింపు
అదే హువానాన్ మార్కెట్ నుంచి పదుల సంఖ్యలో ఇదే జబ్బుతో పేషెంట్లు వచ్చినట్లు కూడా చెప్పారు. అలా కరోనా వైరస్‌కి సంబంధించిన తొలి పేషెంట్‌గా వేగుఇగ్జియాన్‌ను గుర్తించారు. ఆమె ప్రపంచంలోనే పేషెంట్ నంబర్ జీరో. డిసెంబర్ నెలాఖరుకి చేరేసరికి వేగుఇగ్జియాన్‌ను క్వారంటైన్‌కి పంపించారట..ఇదంతా కూడా చైనీస్ డైలీ ది పేపర్ పబ్లిష్ చేసింది. అలా నెలరోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆమె ఇప్పుడు సురక్షితంగా కరోనా కోరల్లోంచి బయటికి వచ్చింది.
చైనా ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే..
అయితే ఆమె చెప్తోన్న విషయాలు వింటే మాత్రం…చైనా ప్రభుత్వం, అక్కడి వైద్యశాఖ ముందే స్పందించి ఉంటే..కరోనా వైరస్ ఈ స్థాయిలో ప్రపంచాన్ని ముంచేసేది కాదనిపిస్తోంది. వుహాన్ క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వేగుఇగ్జియాన్ వైరస్ తీవ్రతని ముందే అంచనా వేసి జాగ్రత్త పడి ఉంటే నష్టం ఈ స్థాయికి చేరేది కాదని చెప్పిందామె.
హువానన్ మార్కెట్ నుంచే 27మందికి సోకిన కరోనా
ఒక్క వుహాన్ హువానన్ మార్కెట్ నుంచే 27మందికి కరోనా సోకినట్లు..తొలి రోజుల్లోనే వుహాన్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అయిన సదరు పిష్ మార్కెట్‌ని మాత్రం డిసెంబర్ చివరి వారం వరకూ మూయలేదు. ప్రస్తుతానికి వేగుఇగ్జియాన్నే పేషెంట్ జీరోగా పరిగణిస్తున్నా… లాన్సెట్ మెడికల్ జర్నల్ మాత్రం డిసెంబర్ 1నే ఓ వ్యక్తికి కరోనా సోకినట్లుగా చెప్తోంది.
అత్యంత వేగంగా ఒకరి నుంచి వందల మందికి
ప్రస్తుతం కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోన్న తరుణంలోనూ హువానన్ సీఫుడ్ మార్కెట్ ఉదంతం ఓ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రద్దీగా ఉన్న చోట్ల ఈ వైరస్ అత్యంత వేగంగా ఒకరి నుంచి వందల మందికి సోకుతుందని..అయినా జనం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా..సండే ఫిష్ మార్కెట్లకు చికెన్ మార్కెట్లకు పోటెత్తడం ఎంత ప్రమాదకరమో..పరిస్థితి చేయి దాటిన తర్వాత కానీ అర్ధం కాదేమో.