Intelligent Parking Chair : చప్పట్లు కొడితే చాలు ఈ కుర్చీలు కావాలనుకున్న చోటుకి కదులుతాయి
చప్పట్లు కొడితే ఆ కుర్చీలు మీరు కావాలనుకున్న చోటకు కదులుతాయి. అత్యాధునిక టెక్నాలజీతో చైనాకు చెందిన నిస్సాన్ కంపెనీ తమ కార్యాలయాల కోసం ఆవిష్కరించిన ఈ ఇంటెలిజెంట్ పార్కింగ్ చైర్స్ గురించి చదవండి.
Intelligent Parking Chair : సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది మనిషికి శారీరక శ్రమ తగ్గిపోతోంది. ప్రతి పని సులభతరం అయిపోతోంది. అలాంటి ఒక ఆవిష్కరణ గురించి చెప్పుకోవాలి. చప్పట్లు కొడితే మీరు ఫిక్స్ చేసిన చోటకి కుర్చీలు కదులుతాయి. ఆశ్చర్యంగా ఉందా? చదవండి.
చైనాలోని నిస్సాన్ మోటార్ కో లిమిటెడ్ కంపెనీ ఇంటెలిజెంట్ పార్కింగ్ చైర్స్‌ను 2016 లోనే తయారు చేసింది. ఈ కుర్చీలు చూస్తే భవిష్యత్‌లో ఆఫీసు ఫర్నీచర్‌ను ఆధునిక టెక్నాలజీతో ఏ విధంగా వాడుకోవచ్చునో అర్ధం అవుతుంది. నిస్సాన్‌లోని ఆటోమోటివ్ ఇన్నోవేటర్లు ఈ సెల్ఫ్ పార్కింగ్ ఆఫీసు కుర్చీల తయారీపై దృష్టి మళ్లించారు.
కేవలం చప్పట్లు కొట్టడం వల్ల ఈ భవిష్యత్ కుర్చీలు మనం సెలక్ట్ చేసుకున్న నిర్దేశిత స్ధానాలలోకి వెళ్లి ఆగుతాయి. రద్దీగా ఉండే ఆఫీసులు, మీటింగ్ రూమ్స్‌లో ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపకరిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. @historyinmemes అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసారు. ‘నిస్సాన్ వారి స్వంత కార్యాలయాల కోసం ఇంటెలిజెంట్ పార్కింగ్ కుర్చీలు తయారు చేసినపుడు’ అనే శీర్షికతో ఈ పోస్టు షేర్ చేశారు.
Nepal vs China: ఇండియా బాటలో నేపాల్.. విద్వేష కంటెంట్ మీద చైనాకు గట్టి షాక్
ఈ ఆటోమేటిక్ కుర్చీల వెనుక ఉన్న సాంకేతికత ఆధునాతన వ్యవస్థను కలిగి ఉంటుంది. ప్రతి కుర్చీలో నాలుగు మోషన్ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇది ఖచ్చితమైన ట్రాకింగ్‌కు అనుమతి ఇస్తుంది. ఈ కెమెరాలు సమాచారాన్ని చేరవేసేందుకు పనిచేస్తాయి. అవి Wi-Fi ద్వారా నిర్దేశించిన స్ధానాలకు కదులుతుంటాయి. ప్రస్తుతం ఈ కుర్చీలు అందరికీ అందుబాటులోకి రాకపోవచ్చును. కానీ వీటిని ఆవిష్కరించిన నిస్సాన్ నైపుణ్యానికి మాత్రం నిదర్శనంగా నిలబడ్డాయి. ఈ కుర్చీల వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ఔరా అంటున్నారు. మీమ్‌లతో, నవ్వు పుట్టించే కామెంట్స్‌తో స్పందించారు.
When Nissan made self parking office chairs just for their own offices pic.twitter.com/QieWjOCAAl
— Historic Vids (@historyinmemes) November 16, 2023