యాహ్యా సిన్వార్ భార్య వద్ద 26 లక్షల హ్యాండ్ బ్యాగ్‌.. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టి విలాసవంతమైన జీవితం

ఆ బ్యాగు హీర్మేస్ కంపెనీకి చెందినది.

యాహ్యా సిన్వార్ భార్య వద్ద 26 లక్షల హ్యాండ్ బ్యాగ్‌.. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టి విలాసవంతమైన జీవితం

Updated On : October 21, 2024 / 4:03 PM IST

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతమైన విషయం తెలిసిందే. సిన్వార్‌కు సంబంధించిన పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అతడి భార్య ఖరీదైన బ్యాగును వాడుతుందని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.

సొరంగాల్లోకి సిన్వార్‌ కుటుంబం వెళ్తున్న సమయంలో అతడి భార్య 26 లక్షల రూపాయల హ్యాండ్ బ్యాగ్‌ పట్టుకుని ఉంది. ఆ బ్యాగు హీర్మేస్ కంపెనీకి చెందినది. పాలస్తీనా సిటీలోని ఖాన్ యూనిస్‌లో సిన్వార్‌ గత ఏడాది సొరంగాల్లోకి వెళ్లినప్పుడు తీసిన వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం విదితమే.

ఆ వీడియోని పరిశీలించిన ఇజ్రాయెల్‌ నిపుణులు సిన్వార్‌ భార్య ఖరీదైన హీర్మేస్ బ్రాండ్ బ్యాగు వాడుతుందని గుర్తించారు. వారి కుటుంబం సొరంగం లోపలికి అప్పట్లో దిండ్లు, పరుపులు, టెలివిజన్, బ్యాగ్‌లను తీసుకెళ్లింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది.

దానికి ఒకరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. హమాస్‌ల తీరు వల్ల గాజా ప్రజలు కష్టాలను చవిచూస్తున్నారని, సిన్వార్, అతని కుటుంబం సభ్యులు మాత్రం సిగ్గులేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఇజ్రాయెల్‌ చెప్పింది. సిన్వార్ కుటుంబం హాయిగా జీవిస్తూ ఇతర వ్యక్తులను మాత్రం యుద్ధం అంటూ చావడానికి పంపుతున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది.

విమానాలకు నకిలీ బెదిరింపు కాల్స్‌ చేసేవారిని నో ఫ్లై జాబితాలో చేర్చుతాం.. ప్రయాణికుల భద్రతపై రాజీ పడము: రామ్మోహన్ నాయుడు