Amazing Town : పట్టణమంతా ఒకే ఒక్క భవనంలో .. అక్కడికి వెళ్లాలంటే ప్రమాదాలను దాటాల్సిందే
పట్టణమంతా ఒకే ఒక్క భవనంలో నివాసముంటుంది. ఆ పట్టణం చూడానికి వెళ్లాలింటే ఎన్నో ప్రమాదాలను దాటాల్సిందే.

Whittier the town.. under one roof' In Alaska
Amazing Town : అదొక అద్భుతమైన పట్టణం. పట్టణం అంటే కొన్ని ఇళ్లు..షాపులు, మాల్స్,పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ ఆ పట్టణం మాత్రం అలా కాదు ఒకే ఒక్క భవనం ఉంటుంది. ఆ పట్టణం అంతా ఒకే ఒక్క భవనంలో నివాసముంటుంది. అలాగని ఆ భవనంలో ఇద్దరో లేదో మహా అయితే ఓ 10మందో ఉంటారనుకుంటున్నారా? కానే కాదు. వందలమంది నివసిస్తుంటారు. ఆ భవనం అదే నండీ ఈ టౌన్ లో పోలీస్ స్టేషన నుంచి హాస్పిటల్ వరకు అన్ని సదుపాయాలు ఉంటాయి. అన్నీ ఒక్క చోటే ఉంటాయి. ఆ అరుదైన పట్టణం పేరు ‘విట్టియర్’. అమెరికాలోని అలాస్కాలో ఉంది. ఈ విట్టియర్ టౌన్ నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది.
అలాస్కాలోని అంకోరేజ్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో విట్టియర్ టౌన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం జనాభా 200. వీరిలో 180 మంది ఒక్క 14 అంతస్తుల భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆ భవనం పేరు ‘బిగిచ్ టవర్స్’.ఈ భవనం ఒకప్పుడు ఆర్మీకి చెందినది. చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా.. వాటిలో ఉండేది అతి తక్కువ మందే.
ఈ విట్టియర్ నిరంతరం మంచుతోనే కప్పబడి ఉంటుంది. ప్రజలందరికీ వేర్వేరుగా వేడి సౌకర్యాలు కల్పించడం, రక్షణ సమస్య అని.. ప్రభుత్వం అందరినీ ఒకే భవనంలోకి మార్పించింది. విట్టియర్‌లోని బిగిచ్ టవర్స్ లోనే చిన్న షాపింగ్ మాల్, పోస్టాఫీసు, పోలీస్ స్టేషన్, ఆస్పత్రి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే టూరిస్టులకు ఇదే భవనంలో బస ఏర్పాట్లు ఉంటాయి.
అన్ని సదుపాయాలు ఉన్న ఆ టౌన్ లో స్కూల్ మాత్రం లేదు. బయటే ఉంటుంది. స్కూల్ కు పిల్లలు వెళతారు కాబట్టి ఏ బస్ లోనే వ్యాన్ లోనే అనుకునేరు. అలాకానే కాదు. మంచు కదా వాహానాలు వెళ్లటం రావటం అంటే అదో పెద్ద అద్భుతమన్నమాటే. అస్సలు సాధ్యం కాదు. అందుకని పిల్లలు స్కూల్ కు వెళ్లిరావటానికి ఈ బిగిన్ టవర్స్ భవనం నుంచి స్కూల్ వరకు ఒక సొరంగం (అండర్ గ్రౌండ్ టన్నెల్) ఉంటుంది.
ఇన్ని చిత్రాలు ఉండటంతో ఇటీవల ఈ టౌన్ బాగా ఫేమస్. ఆ గ్రామాన్ని చూడటానికి వచ్చే పర్యాటకుల బాగా ఉంటుంది. మరి వారు వచ్చి వెళ్లటం సంగతి కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఆ గ్రామాన్ని చూడాలనుకుంటే ప్రమాదాలను అధిగమించాల్సిందే. ప్రమాదాలు దాటుకుని వచ్చి మరీ ఆ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పర్యాటకుల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మొదలయ్యాయి విట్టియర్ లో. అలా ఆ గ్రామాన్ని చూడటానికి వచ్చి వెళ్లినవారు కొండల మధ్య ఘాట్ రోడ్లు, టన్నెళ్ల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందని.. అది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.