టాయిలెట్ పేపర్ సంక్షోభం: ఎందుకంటే?

  • Published By: vamsi ,Published On : March 10, 2020 / 10:45 AM IST
టాయిలెట్ పేపర్ సంక్షోభం: ఎందుకంటే?

Updated On : March 10, 2020 / 10:45 AM IST

విశ్వ మానవాలి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అయితే కోరోనా వైరస్ వచ్చాక.. ఆ భయంతో మాస్క్‌ల సంక్షోభం రావడం చూశాం. అయితే ఇప్పుడు టాయిలెట్ పేపర్ సంక్షోభం కూడా రావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో టాయిలెట్ పేపర్ సంక్షోభం ఇప్పుడు కలవరపెడుతుంది. జపనీయులు, ఆస్ట్రేలియన్లు, ఇంకా సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో టాయిలెట్ పేపర్ సంక్షోభం ఇప్పుడు ప్రజలను భయపెడుతుంది.

సూపర్‌మార్కెట్లలో టాయిలెట్ పేపర్ కొద్దిసేపటికే అయిపోతుంది. దీంతో ఆయా దేశాల్లో మార్కెట్లు మనిషికి నాలుగు టాయిలెట్ పేపర్‌లు మాత్రమే అమ్ముతున్నాయి. ఈ మేరకు ఆయా దేశాల్లో నిబంధనలు పెడుతున్నారు. టాయిలెట్ పేపర్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో వందల డాలర్లకు అమ్ముతున్నారు. విపరీతంగామ రేట్లు పెంచేసి షాపుల వాళ్లు.. కృత్రిమ కొరతను సృష్టించారు. పరిస్థితి ఎలా మారిపోయిందంటే పబ్లిక్ టాయిలెట్లలోని పేపర్‌ని కూడా జనం దొంగిలిస్తున్నారు.

దీనంతటికీ కారణం కరోనా వైరస్.. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో.. టాయిలెట్ పేపర్ విపరీతంగా కొంటున్నారు ప్రజలు..  అవసరమని భావిస్తే రెండు వారాలకు సరిపడా ఆహారం, మంచినీళ్లు, ఇతరత్రా అవసరమైన సరుకులను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వాలు సూచించడంతో.. ఎక్కువ కాలం నిల్వ చేసుకోగల ఆహారం, సరకుల కన్నా ముందుగా టాయిలెట్ పేపర్‌ నిల్వ చేసుకోవాలని ప్రజలు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే టాయిలెట్ పేపర్ గిరాకీ భారీగా పెరిగిపోయింది. అయితే సూపర్‌మార్కెట్లలో లావెటరీ పేపర్ మొత్తం ఖాళీ చేయటం తెలివైన పని కాదని ప్రభుత్వం అంటుంది. టాయిలట్ పేపర్‍‌కి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం అని కూడా హెచ్చరిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి తోడ్పడేది మెడిసిన్, మాస్కులు, హ్యాండ్ సానిటైజర్లు.. టాయిలెట్ పేపర్‌తో వైరస్ మీద ఎలా పోరాడతారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

See Also | కరోనా వైరస్ ఎక్కించుకుంటే రూ.3 లక్షలు ఇస్తారంట!