United States : దారుణం.. 6 నెలల చిన్నారిని సజీవంగా తినేసిన ఎలుకలు.. పోలీసులు విచారణలో
తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. నిద్రిస్తున్న ఓ చిన్నారిపై ఎలుకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలో పోలీసులు కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.

United States
United States : 6 నెలల పసిగుడ్డును ఎలుకలు ఘోరంగా కొరికేసాయి. 50 కంటే ఎక్కువసార్లు కరవడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కుటుంబ సభ్యులను అరెస్టు చేసారు.
COVID boosters : అమెరికన్లకు కొత్త కొవిడ్ బూస్టర్…యూఎస్ ఆరోగ్యసంస్థ సిఫార్సు
సెప్టెంబర్ 13 న ఇండియానాలో నిద్రిస్తున్న 6 నెలల పసికందును ఎలుకలు కొరికేసాయి. చిన్నారిపై దాడి చేసి 50 కంటే ఎక్కువసార్లు కరిచాయి. చిన్నారి తండ్రి ఇవాన్స్ విల్లే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు స్పందించారు. ఎలుకలు చిన్నారిపై దాడి చేసినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. చిన్నారి తల్లిదండ్రులు డేవిడ్, ఏంజెల్ స్కోనాబామ్, అత్త డెలానియా థుర్మాన్‌ను పోలీసులు అరెస్టు చేసారు.
Sanatana Dharma Row : అమెరికాలో సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా ప్రకటన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారి శరీరంపై 50 కి పైగా ఎలుక కొరికిన గాయాలు కనిపించాయని.. తాము వెళ్లేసరికి చిన్నారి రక్తపు మడుగులో ఉన్నట్లు చెప్పారు. పసికందును ఇండియానాపోలీస్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో చిన్నారి ఇంటికి వెళ్లేసరికి ఇల్లు చిందరవందరగా ఉందని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో ఇంట్లోని మిగిలిన చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల రక్షణ నుంచి తొలగించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.