UK : రాయి అనుకుని డస్ట్ బిన్‌లో వేద్దామనుకుంది..చివరిలో

కొని చాలా రోజులు కావడంతో..మరిచిపోయింది. ఓ రోజు..అనవరమైన వస్తువులను డస్ట్ బిన్ లో పడేసేందుకు సిద్ధమైంది.

UK : రాయి అనుకుని డస్ట్ బిన్‌లో వేద్దామనుకుంది..చివరిలో

34 Carat Diamond

Updated On : October 30, 2021 / 6:10 PM IST

Throw Away Has A 34-Carat Diamond : చెత్తబుట్టలో పడేయాలని అనుకున్న ఓ రాయి ఖరీదు రూ. 20 కోట్లు అని తెలియగానే..బామ్మ ఆశ్చర్యపోయింది. అనవసరమైన వస్తువలను డస్ట్ బిన్ లలో పడేస్తుండగా…అనూహ్యంగా ఆ స్టోన్ ను కూడా పడేయబోంది. ఎందుకో..ఆగిపోయింది. ఇతరుల సూచన మేరకు పరీక్షిస్తో పోలా ? అనుకుంది. అది రాయి..కాదు..డైమండ్ అని తేలడంతో ఆమె అవాక్కయ్యింది. ఈ ఘటన యూకే రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Winter Skincare Tips: చలికాలం వచ్చేసింది.. సింపుల్ టిప్స్‌తో చర్మాన్ని కాపాడుకోండిలా

యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ…రకరకాల వస్తువులను తీసుకొచ్చే వాళ్ల దగ్గరి నుంచి ఓ స్టోన్ ను కొనుగోలు చేసినట్లు ఆమెకు గుర్తు. కొని చాలా రోజులు కావడంతో..మరిచిపోయింది. ఓ రోజు..అనవరమైన వస్తువులను డస్ట్ బిన్ లో పడేసేందుకు సిద్ధమైంది. అప్పుడు ఆ స్టోన్ దొరికింది. దీనిపై నార్త్ షీల్డ్స్ లోని ఫీటన్ బై వేలం పాటదారులకు చెందిన మార్క్ లేన్ మాట్లాడారు. ఆభరణాల బ్యాగులో దానిని పెట్టుకొని వచ్చిందని, ఒక పెద్ద రాయి వలే అనిపించిందన్నారు.

Read More : Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!

డైమండ్ టెస్టర్ తో టెస్టు చేసేంత వరకు దానిని తాము గుర్తించుకోలేకపోయామన్నారు. బెల్జియంలో ఆంట్ వెర్ప్ లోని నిపుణులచే ధృవీకరించక ముందే..తాము దానిని లండన్ లోని తమ భాగస్వాములకు పంపామన్నారు. దీనిని రూ. 24 కోట్లు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్ గా నిర్ధారించారు. ఈ డైమండ్ రింగ్ ను నవంబర్ 30వ తేదీన వేలం వేస్తామని..అప్పటి వరకు లండన్ లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్ లో ఉంచుతామన్నారు.