Worm in the chocolate bar : చాక్లెట్ లు తింటున్నారా? పురుగులు ఉంటున్నాయి జాగ్రత్త

చాక్లెట్ అంతే అందరికీ ఇష్టమే. కానీ కొన్ని సంఘటనలు చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఓ మహిళ సగం తిన్న చాక్లెట్ బార్‌లో పురుగు కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో, వీడియో ఆన్ లైన్‌లో హల్ చల్ చేయడంతో చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇప్పుడు దానిని అసహ్యించుకుంటున్నారు.

Worm in the chocolate bar : చాక్లెట్ లు తింటున్నారా? పురుగులు ఉంటున్నాయి జాగ్రత్త

Worm in the chocolate bar

Updated On : May 21, 2023 / 3:58 PM IST

worm in chocolate : ఎంతో ఇష్టంగా తినే వస్తువుల్లో అకస్మాత్తుగా పురుగులు కనపడితే? హడలిపోతాం. చూడకుండా వాటిని తినేస్తే? ఎంత హాని చేస్తాయి. రీసెంట్ గా ఓ మహిళ సగం తిన్న చాక్లెట్ లో పురుగు కనిపించింది. చాక్లెట్ రంగును పోలి ఉండటంతో ఆమె ముందుగా కనిపెట్టలేకపోయింది.

Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

షాకింగ్ ఫోటో, వీడియో ఒకటి ఆన్ లైన్ లో కనిపించింది. ఇది చూస్తే మీరు మాత్రమే కాదు.. మీ ఇంట్లో ఎవ్వరూ.. ముఖ్యంగా పిల్లలతో సహా కొంతకాలం చాక్లెట్ లకు దూరంగా ఉంటారు. ఓ మహిళ చాక్లెట్ బార్ ను ఆనందంగా ఆస్వాదిస్తూ తింటోంది. సగం తిన్న తరువాత చాక్లెట్ లో పాకుతున్న పురుగును చూసి షాకైంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ క్రాబోలిటా ఈ వీడియోని షేర్ చేసింది. పురుగు చాక్లెట్ రంగును పోలి ఉండటంతో ఆ మహిళ వెంటనే గమనించలేకపోయిందట. ఈ ఫోటోలు, వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

యూజర్లు ఈ ఘటనను చూసి చిరాకు పడ్డారు. చాక్లెట్స్ కొనొద్దని సూచిస్తున్నారు. చాక్లెట్స్ తినమని కూడా చెబుతున్నారు. నిజానికి చిన్నా, పెద్దా చాక్లెట్స్ తినడానికి చాలా మక్కువ చూపుతారు. ఇలాంటి సంఘటనలు చూస్తే మాత్రం జీవితంలో చాక్లెట్ జోలికి పోకూడదనిపిస్తుంది.