వాటిని పెంచుకుంటే ఇంతేమరి :  ముద్దుగా పెంచుకుంటే మింగేసింది

ముద్దుగా పెంచుకున్న మొసలికి బలైపోయింది ఉమెన్ సైంటిస్ట్.ఇండోనేషియాకు చెందిన మౌల్ట్ అనే సైంటిస్ట్ పెంచుకునే మొసలికి ఆహారమైపోయింది.

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 08:04 AM IST
వాటిని పెంచుకుంటే ఇంతేమరి :  ముద్దుగా పెంచుకుంటే మింగేసింది

ముద్దుగా పెంచుకున్న మొసలికి బలైపోయింది ఉమెన్ సైంటిస్ట్.ఇండోనేషియాకు చెందిన మౌల్ట్ అనే సైంటిస్ట్ పెంచుకునే మొసలికి ఆహారమైపోయింది.

ఇండోనేషియా : జంతువుల్ని పెంచుకోవటం సరదగానే వుంటుంది. కొంతమంది క్రూర జంతువల్ని, విష సర్పాల్ని కూడా పెంచుకుంటుంటారు. ఇటువంటివి చూస్తే..ఇవి వారిని ఏమీ చేయావా..ఒకవేళ చేస్తే..పరిస్థితి ఏంటి అనే భయం వేస్తుంది కదూ..అటువంటి ఘటను జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. క్రూర జంతువులను పెంచుతున్నా వాటితో ఎప్పటికైనా ప్రమాదం వెన్నంటే ఉంటుంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది ఇందుకు ఇండోనేషియాలో జరిగిన ఓ దారుణ ఘటన. ఓ మహిళా సైంటిస్ట్ ముద్దుగా పెంచుకునే ఓ మొసలికి ఆహారమైపోయింది. 

తాను ఎంతో ముచ్చటపడి ముద్దుగా పెంచుకుంటున్న మొసలి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంది 44 ఏళ్ళ  ఉమెన్ సైంటిస్ట్  మౌల్డ్. ఎన్నో పరిశోధనలు చేసే సైంటిస్ట్ లు జంతువులను పెంచుకోవటం మామూలే. అలాగే  ఇండోనేషియాలోని ఉత్తర సులావెసీలోని మినాహాసాలో సైంటిస్ట్  మౌల్డ్ తన ఇంటి ముందు ఓ మడుగులాంటి వాటర్ టమ్ ఏర్పాటు చేసి దాంట్లో 14 అగడుగుల ఓ మొసలిని పెంచుతోంది.  తానే స్వయంగా దానికి ఫుడ్ పెడుతుంటుంది. దాంతో ఆటలు కూడా ఆడుకుంటు చాలా ముద్దు చేసేది. ఈ క్రమంలో ఆ మొసలికి ఏమైందో తెలీదు గానీ..మొసలికి ఫుడ్ పెడుతున్న సమయంలో యజమానురాలిపైనే తీవ్రంగా దాడి చేసింది. ఫుడ్ పెడుతుండగా..నోటికి అందిన చేతిని తినేసింది. అక్కడితో ఆగకుండా ఆమె పొట్ట భాగాన్ని తినేసింది. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని ఆమె కొలిగ్స్ నెక్ట్స్  డే గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. వైద్యులు, ఆర్మీ, పోలీసుల సాయంతో మొసలిని శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.