inspirational women : ఆ అమ్మాయి చేసిన పనిని అందరూ ఫాలో అయ్యారు.. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది?

ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఎదుటివారికి సాయం చేయాలంటే దయ గల మనసుండాలి. ఇక మనం చేసే మంచి పని పదిమందికి ఆదర్శంగా కూడా నిలబడాలి. ఓ మహిళ చేసిన చిన్న సాయం మరికొందరినీ ఎంతలా ఇన్‌స్పైర్ చేసిందో చదవండి.

inspirational women : ఆ అమ్మాయి చేసిన పనిని అందరూ ఫాలో అయ్యారు.. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది?

inspirational women

Updated On : April 23, 2023 / 1:39 PM IST

inspirational women : బస్సుల్లో, ట్రైన్లలో మహిళలు, వృద్ధులకు కేటాయించిన సీట్లలో కూడా ఇతరులు కూర్చుంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ బస్ ఎక్కినా సీటు ఇవ్వడానికి ఆలోచిస్తారు. కానీ మనం ఒక మంచి పని చేస్తే ప్రపంచం కూడా దానిని ఫాలో అవుతుంది. కావాలంటే ఇది చదవండి.

woman post went viral : కుటుంబంలో పెద్ద కూతురిగా పుట్టడం ఓ పోరాటమే.. మనసుని టచ్ చేసిన ఓ మహిళ పోస్ట్

ఆటోలు, బస్సులు, ట్రైన్లలో మహిళలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు, గర్భిణీలు ప్రయాణిస్తుంటారు. సీటు దొరికితే అతుక్కుపోయే వారే తప్పితే వీరి కోసం ఆలోచించేవారు అరుదుగా ఉంటారు. ఇక బయట ఎక్కడైనా క్యూలైన్లలో కూడా ఇదే తంతు. కాస్త చోటు, కొంచెం సమయం వేచి చూడటానికి సహనం కోల్పోతారు. విషయానికి వస్తే రీసెంట్ గా ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. మనసుని కదిలిస్తోంది. ఓ క్యూలైన్‌లో నిల్చున్న అమ్మాయి వద్దకి ఓ గర్భిణీ స్త్రీ వచ్చి చోటివ్వమని అడుగుతుంది. వెంటనే స్పందించిన అమ్మాయి ఆమెకు చోటిచ్చి  తాను చివరికి వెళ్లి నిలబడుతుంది. ఇక ఆమె వెనుక ఉన్న మగవారంతా ఒకరి తరువాత ఒకరు వెనక్కి వెళ్లి ఆమె వెనుక నిలబతారు. ఫైనల్ గా గర్భిణీ స్త్రీకి చోటిచ్చిన అమ్మాయి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇన్ స్పైర్ చేస్తోంది.

amritsar golden temple : గోల్డెన్ టెంపుల్ లోకి రానీయకుండా మహిళను అడ్డుకున్న సిబ్బంది.. కారణం ఏంటంటే? ఆ మహిళ…

CCTV IDIOTS అనే ట్విట్టర్ యూజర్ ద్వారా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో కావాలని చేసారని కొందరు.. మంచి పని అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో రియల్ అయినా.. కావాలని చేసినా తోటివారికి సాయపడాలన్న విషయం చెబుతూ అందర్నీ ఇన్ స్పైర్ చేస్తోంది.