Woman Uses Snake as Hairband : పామును కొప్పుకు చుట్టిన యువతి : వైరల్ వీడియో

ఓ యువతీ తన జుట్టును మూసివేసేందుకు చేసిన సాహసం ఇప్పుడు అందరిని ఔరా అనేలా చేస్తుంది. ఎందుకంటే ఆ యువతీ తన జుట్టు ముడివేసింది ఒక పాముతో మరి.

Woman Uses Snake as Hairband : పామును కొప్పుకు చుట్టిన యువతి : వైరల్ వీడియో

Woman Uses Snake As Hairband

Updated On : December 24, 2021 / 12:08 PM IST

Woman Uses Snake as Hairband : సాధారణంగా మహిళలు జుట్టు ముడివేసుకోవడానికి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్పులు, రిబ్బన్ ను వాడుతుంటారు. తమ జుట్టు అల్లికను మరింత అందంగా ఆకర్షణగా మార్చుకునేందుకు, రకరకాల ఉపకరణాలు వాడుతుంటారు. అయితే ఓ యువతీ తన జుట్టును మూసివేసేందుకు చేసిన సాహసం ఇప్పుడు అందరిని ఔరా అనేలా చేస్తుంది. ఎందుకంటే ఆ యువతీ తన జుట్టు ముడివేసింది ఒక పాముతో మరి. మీరు చదివింది నిజమే. సజీవంగా ఉన్న పాముతో ఓ యువతీ తన జుట్టును ముడివేసింది.

చదవండి : Viral video : వాళ్లలాకాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని త‌ప్ప‌కుండా చేస్తారు..: పోలీసు అధికారి వ్యాఖ్యలు

స్నేక్ వరల్డ్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ యువతీ తన కొప్పుకు చిన్న పామును చుట్టి, స్థానికంగా ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్ళింది. పామును అలాగే జుట్టుకు ముడివేసి మాల్ మొత్తం కలియ తిరిగిన యువతీ తనను ఎవరు గమనించ లేదనుకుంది. ఇంతలో యువతీ వెనుకనున్న వ్యక్తి ఒకరు, పామును గమనించి.. యువతిని వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చదవండి : Viral Video: ఈ కుక్క తెలివికి నెటిజన్లు ఫిదా..

ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. “ఆ అమ్మాయికి ఎంత ధైర్యమో కదా” అని కామెంట్ చేసారు. “ఆ పాము నిజమైనదేనా, అలా ఎలా కూర్చుంది సైలెంట్ గా” అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇది చూసిన కొందరు కొప్పున్నమ్మ ఏ పువ్వు పెట్టినా అందమే అనే సామెత దీనికి వర్తిస్తుంది అని అంటున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు 16000 వ్యూస్ రాగా, 800 లైక్స్ వచ్చాయి.

 

 

 

View this post on Instagram

 

A post shared by ?SNAKE WORLD? (@snake._.world)