కంపు కొట్టే కాస్టలీ ఫ్రూట్ : ఒక్కో పండు రూ. 72వేలు

ఆస్ట్రేలియాలో అత్యంత దుర్గంధం వెదజల్లే పండు ఏదైనా ఉందంటే అదే డురియన్ పండు. పనాస పండును పోలిన ఈ పండు.. అత్యంత అరుదుగా దొరికే జే-క్వీన్ బ్రాండ్ డురియన్ గా పిలుస్తారు.

  • Published By: sreehari ,Published On : January 31, 2019 / 12:41 PM IST
కంపు కొట్టే కాస్టలీ ఫ్రూట్ : ఒక్కో పండు రూ. 72వేలు

Updated On : January 31, 2019 / 12:41 PM IST

ఆస్ట్రేలియాలో అత్యంత దుర్గంధం వెదజల్లే పండు ఏదైనా ఉందంటే అదే డురియన్ పండు. పనాస పండును పోలిన ఈ పండు.. అత్యంత అరుదుగా దొరికే జే-క్వీన్ బ్రాండ్ డురియన్ గా పిలుస్తారు.

ఆస్ట్రేలియాలో అత్యంత దుర్గంధం వెదజల్లే పండు ఏదైనా ఉందంటే అదే డురియన్ పండు. పనాస పండును పోలిన ఈ పండు.. అత్యంత అరుదుగా దొరికే జే-క్వీన్ బ్రాండ్ డురియన్ గా పిలుస్తారు. ఈ పండు అంటే అక్కడి జనం దూరంగా పారిపోతారు.  ఎందుకంటే.. డురియన్ పండు నుంచి భరించలేని దుర్గంధపు వాసన వస్తుంది. డురియన్ పండు కుళ్లిపోవడంతో ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్శిటీనే ఖాళీ చేయించారంటే దాని వాసన ఎంత గాఢత ఉంటుందో చెప్పనక్కర్లేదు. విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ డురియన్ పండుపై నిషేధం విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దుర్గంధపు పండును ఎవరైనా ఇష్టపడతారా? పోను తింటారా? కనీసం కొనేందుకు అయినా ముందుకు వస్తారా? అయినప్పటికీ ఈ జాతి పండు మార్కెట్లో అమ్ముడుపోయింది. ఒకటి కాదు.. రెండు డురియన్ పండ్లు అమ్ముడుపోయాయి. 

ముక్కు పగిలిపోయేంత దుర్గంధం వెదజల్లే ఈ పండును ఎవరూ కొంటారు. మహా అయితే పదో, ఇరవైకో కొంటారు. అంతేగా అనుకుంటే పొరపాటే. డురియన్ పండు ఒక్కొక్కటి వేలల్లో అమ్ముడుపోయింది ఈ పండు. ఒక్కో పండు యూస్ వెయ్యి డాలర్లు (రూ.72వేలు)కు అమ్మేశారు. మీరు విన్నది నిజమే. ఈ రెండు డురియన్ పండ్లను ఇండోనేషియాలోని తస్కిమాలయ సిటీ వెస్ట్ జావా ప్రావిన్స్ సూపర్ మార్కెట్లో డిసిప్లే పెట్టారు.

ఒక్కో పండును (14 మిలియన్ రుపియా)కు భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రెండు డురియన్ పండ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పండుపై ఒక్కో ప్రైస్.. అక్కడి కూలీలకు నెలవారీ వచ్చే జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. ఈ డురియన్ పండును కొనడం అయితే కొన్నారు.. ఎలా తింటారు బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.