ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే

  • Published By: madhu ,Published On : March 19, 2020 / 01:07 AM IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే

Updated On : March 19, 2020 / 1:07 AM IST

కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య.. 8 వేల 943 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలు రేకేత్తిస్తోంది.

See Also | భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ : మోడీ..ఏం చెబుతారో

2 లక్షల 18 వేల 663 మంది కరోనా సోకగా.. ఇందులో 6 వేల 921 మంది పరిస్థితి విషమంగా ఉంది. 84 వేల 383 మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు. వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోట్ల మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దక్షిణాసియా, అమెరికా, యూరోప్‌లలో జనజీవనం భారంగా మారింది. 3237 మరణాలతో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా డెత్స్ నమోదైన దేశంగా చైనా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా… ఆ తర్వాత స్థానంలో ఇటలీ ఉంది. ఈ దేశంలోనూ దాదాపు 3వేల మంది వరకు మరణించారు. ఇరాన్‌లో వెయ్యి మందికి పైగా చనిపోగా.. స్పెయిన్‌‌లో 623మంది, ఫ్రాన్స్‌లో 264మంది కరోనాకు బలయ్యారు. అటు అమెరికా, ఇటు యూకేలోను మృతుల సంఖ్య వంద దాటింది. 

దేశం మృతుల సంఖ్య
 
 చైనా 3, 237 
ఇటలీ 2, 978
ఇరాన్ 1, 135
స్పెయిన్ 638
ఫ్రాన్స్ 264
అమెరికా 150
సౌత్ కొరియా 84
యూకే 104
నెదర్లాండ్స్ 58
స్విట్జర్లాండ్ 33
జపాన్ 29
జర్మని 28
ఇండోనేషియా 19
ఫిలీప్పీన్స్ 17
ఇరాక్ 12
బెల్జియం 14
స్వీడన్ 10