Zelensky: జెలెన్‌స్కీ జాకెట్ ఖరీదు రూ.90లక్షలా

అదేంటి.. యుక్రెయిన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువ ఎక్కువ కదా. అలాంటిది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వేసుకున్న జాకెట్ ధర అంత ఎక్కువ పలకడమేంటని అనుమానంగా ఉందా..

Zelensky: జెలెన్‌స్కీ జాకెట్ ఖరీదు రూ.90లక్షలా

Russia Ukraine War Zelenskyy Urges Nato To Impose No Fly Zone Over Ukraine

Updated On : May 8, 2022 / 10:13 PM IST

Zelensky: అదేంటి.. యుక్రెయిన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువ ఎక్కువ కదా. అలాంటిది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వేసుకున్న జాకెట్ ధర అంత ఎక్కువ పలకడమేంటని అనుమానంగా ఉందా.. అయితే ఇది నిజమైన ధర కాదు. ఇది వేలంలో పలికిన ధర.

వొలొదిమిర్ జెలెన్ స్కీ ధరించిన ఖాకీ జాకెట్ రూ.85.46లక్షలు అంటే (90వేల పౌండ్లు)వరకూ పలికిందట. లండన్ లోని యుక్రెయిన్ రాయబార కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. రష్యా దండయాత్ర జరిపిన సమయంలో మొక్కవోని ధైర్యాన్ని చూపించిన జెలెన్ స్కీ.. ఖాకీ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించారు.

జాకెట్ ప్రారంభ ధర 50వేల పౌండ్లుగా నిర్ణయించగా.. అత్యధిక ధరకు కొనుగోలు చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపుతో అంతటి ధర పలికింది. ఈ జాకెట్ తో పాటు కాకరెల్ జగ్, పలు వస్తువులను కూడా వేలంలో ఉంచారు.

Read Also : మీ సాయం మరువం, పుస్తకాల్లో రాసుకుంటాం- జెలెన్ స్కీ

“మేయర్ క్లిట్ ష్కతో కలిసి పర్యటించా. అది అందమైన నగరం.ఈ పర్యటన కోసం వీలైనంత ఖర్చు పెట్టొచ్చని చెప్తూ వేలంలో పాల్గొన్నవారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు జాన్సన్. కీవ్ కు మళ్లీ ముప్పు ఉండదని, ఆ దేశం మరోసారి స్వేచ్ఛగా ఉంటుందని జాన్సన్ వ్యాఖ్యానించారు.