యుక్రెయిన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైన జెలెన్స్కీ.. కానీ, ఆ షరతులు అంగీకరిస్తేనే..

యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలై నేటితో మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

యుక్రెయిన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైన జెలెన్స్కీ.. కానీ, ఆ షరతులు అంగీకరిస్తేనే..

Zelenskyy

Updated On : February 24, 2025 / 7:56 AM IST

Volodymyr Zelensky: యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలై నేటితో మూడేళ్లు అవుతుంది. 2022 ఫిబ్రవరి 24న ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇంకా యుక్రెయిన్ పై రష్యా దాడులు నిర్వహిస్తూనే ఉంది. యుక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. యుక్రెయిన్ వైమానిక దళం ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజల భద్రత, ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితి వంటి అంశాలు యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధానికి మూడేళ్లు పూర్తయిన వేళ యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: చైనా వుహాన్ ల్యాబ్‌లో మరో కొత్త వైరస్.. ఇప్పటివరకు ఈ ప్రమాదకర వైరస్‌ గురించి ఏమేం తెలిశాయి?

యుక్రెయిన్ లో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ ప్రకటించారు. అయితే, అందుకు బదులుగా యుక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెలెన్స్కీ ఓ నియంత.. అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదంటూ చేసిన వ్యాఖ్యలకు జెలెన్స్కీ స్పందించారు. తాను నియంతను కాదని చెప్పుకొచ్చాడు.

Also Read: Rana Wife Food Store : రూ.5 లక్షల మష్రూమ్.. వెయ్యి రూపాయల కొబ్బరి బోండం.. రానా భార్య ఫుడ్ షాప్ లో కాస్ట్లీ ఫుడ్స్..

అమెరికా – యుక్రెయిన్ దేశాల మధ్య ఖనిజ నిక్షేపాల ఒప్పందం చర్చలపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది.. సహజ వనరులను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. యుద్ధం ముగింపు విషయంలో భద్రతా హామీలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు యుక్రెయిన్ కు వస్తున్నారని, ఇదొక కీలక మలుపుగా నిలుస్తుందని జెలెన్స్కీ పేర్కొన్నాడు. యుద్ధానికి స్వస్తి పలికేందుకు ఉద్దేశించి నిర్వహించే ఏ చర్చల్లోనైనా తమ భాగస్వామ్యం ఉండాల్సిందేనని జెలెన్స్కీ అన్నారు.