IPL 2020: ఇట్స్ చేజింగ్ టైం.. కోల్‌కతా టార్గెట్ 196

IPL 2020: ఇట్స్ చేజింగ్ టైం.. కోల్‌కతా టార్గెట్ 196

Updated On : September 23, 2020 / 9:58 PM IST

ఐపీఎల్‌లో మ‌రో రసవత్తర పోరు జరగనుంది. టాస్ ఓడిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి 195పరుగులు చేయగలిగింది. 10ఓవర్ల స్కోరును బట్టి చూస్తే 200కి మించి నమోదు చేస్తుందని భావించారు. క్వింటాన్ డికాక్ స్వల్ప స్కోరుతోనే వెనుదిరిగినప్పటికీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. కోల్ కతాకు కౌంటర్ అటాక్ ఇచ్చి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. సెకండ్ వికెట్ 90 పరుగులు జోడించారు. 18వ ఓవర్లో రోహిత్ వెనుదిరగడంతో ఒక్క బౌండరీ సాధించడం కూడా కష్టంగానే మారింది.

ఓ మాదిరి టార్గెట్ అందించిన ముంబైతో మ్యాచ్ రసవత్తరంగానే మారింది. గతంలో కోల్‌కతా చేధించి గెలిచిన టార్గెట్లు ఇలా ఉన్నాయి. 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 206, 2014 ఫైనల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో 200, 2012ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో 191చేయగలిగాయి.