గర్జించిన సన్ రైజర్స్ హైదరాబాద్, పరాజయం చెందిన ఢిల్లీ క్యాపిటల్

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 07:50 AM IST
గర్జించిన సన్ రైజర్స్ హైదరాబాద్, పరాజయం చెందిన ఢిల్లీ క్యాపిటల్

Updated On : October 28, 2020 / 8:11 AM IST

Sunrisers Hyderabad defeated the Delhi Capitals : సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ దుమ్ము రేపింది. ప్లే ఆఫ్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గర్జించింది. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడ్డ హైదరాబాద్‌..ఢిల్లీపై ఆకాశమే హద్దుగా చెలరేగింది.



మొదట పరుగుల వర్షంతో ప్రత్యర్థిని ముంచెత్తి ఆపై బౌలింగ్‌లోనూ అదరగొట్టి స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ దిల్లీ బౌలింగ్‌ను ఉతికిపారేస్తే..మాయావి రషీద్‌ఖాన్‌ ఆ జట్టును చుట్టేశాడు.



కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. సాహా, వార్నర్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడారు.



ఇక భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌లో దూకుడు కనిపించలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. రషీద్‌ తన తొలి ఓవర్‌లోనే స్టొయినిస్‌ , హెట్‌మైర్‌లను అవుట్‌ చేశాడు. ఓపెనర్‌ రహానే ఎక్కువ సేపు నిలువలేదు. కెప్టెన్‌ అయ్యర్‌ వైఫల్యంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది.