TSLPRB : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ తుది రాతపరీక్షల తేదీ ఖరారు

సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

TSLPRB : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ తుది రాతపరీక్షల తేదీ ఖరారు

TSLPRB

Updated On : April 22, 2023 / 3:31 PM IST

TSLPRB : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల బర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్ (ఐటీ ఆండ్ సీవో) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షల తేదీని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు(టీఎస్ఎల్ పీఆర్బీ) ఖరారు చేసింది.

ఏప్రిల్ 30న రాత పరీక్షలను నిర్వహించాలని టీఎస్ఎల్ పీఆర్బీ నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Odisha Transgenders: పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు పర్మిషన్

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 24న ఉదయం 8గంటల నుంచి 28న అర్ధరాత్రి 12గంటల వరకు సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే support@tslprb.inకు మెయిల్ లేదా 9393711110, 9391005006 నెంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించింది.