NTPC Jobs : ఉద్యోగాలు భర్తీ… దరఖాస్తుకు చివరి సమయం

నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ ..

NTPC Jobs : ఉద్యోగాలు భర్తీ… దరఖాస్తుకు చివరి సమయం

Ntpc Jobs

Updated On : June 8, 2021 / 6:57 AM IST

NTPC Jobs : నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 280 ఖాళీలు ఉన్నాయి. ధరఖాస్తు చేసుకోవటానికి చివరి అవకాశం జూన్ 10వ తేదీ వరకు ఉంది.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను గేట్ పరీక్షలో వచ్చిన మార్కుల అధారంగా ఎంపిక చేస్తారు. ధరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారై ఉండాలి. పోస్టుల ధరఖాస్తు ప్రక్రియ మే 21 నుండి ప్రారంభం కాగా ధరఖాస్తు చేసుకునేందుకు జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.

దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన వారికి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం, ధరఖాస్తు ఫారమ్ నింపేందుకు ntpccareers.net వెబ్ సైట్ నందు పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.