Road Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టవేరా వాహనం ఢీకొని 11 మంది మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.

Road Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టవేరా వాహనం ఢీకొని 11 మంది మృతి

Road Accident

Updated On : November 4, 2022 / 9:23 AM IST

Road Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్‌ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

టవేరా కారులో ఉన్న వారంతా మహారాష్ట్రలోని అమరావతి నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు. టవేరా డ్రైవర్‌కు మార్గమధ్యలో నిద్రరావడంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని బేతుల్‌ ఎస్పీ సిమ్లా ప్రసాద్‌ తెలిపారు. ప్రమాదంలో కారు భారీగా ధ్వంసమైంది.  ప్రాణాలు కోల్పోయిన వారు రాష్ట్రానికి చెందినవారా.. లేక వేరే ప్రాంతం వ్యక్తులా అనేది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.