Murder For Mangoes : మామిడి పండ్ల కోసం చెల్లిని చంపిన అక్కలు.. ముగ్గురూ మైనర్లే

జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు.

Murder For Mangoes : మామిడి పండ్ల కోసం చెల్లిని చంపిన అక్కలు.. ముగ్గురూ మైనర్లే

Murder For Mangoes

Updated On : June 5, 2021 / 3:28 PM IST

Murder For Mangoes : జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు. చనిపోయిన చెల్లి, చంపిన అక్కలు అంతా మైనర్లే. హత్యకు గురైన బాలిక వయసు 6ఏళ్లు. చంపిన వారిలో ఒకరి వయసు 12 ఏళ్లు, మరొకరిది 9 ఏళ్లు.

మామిడి పండ్ల కోసం ముగ్గురు బాలికలు మామిడి తోటలోకి వెళ్లారు. పండ్లు పంచుకునే విషయంలో 6ఏళ్ల బాలికకు, ఇద్దరు అక్కలకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు అక్కలు.. చెల్లి అనే విషయాన్ని మరిచిపోయి గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత విషయం బయటకు రాకుండా ఉండేందుకు చెల్లి మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టారు.

బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అన్ని చోట్లా వెతికారు. కానీ ఎక్కడా కనిపించ లేదు. వారికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఇద్దరు అక్కలు అసలు విషయం చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు నిర్ధాంతపోయారు. రంగంలోకి దిగిన చక్రధర్‌పూర్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులైన మైనర్లపై కేసు నమోదు చేశారు.