Viral Video: వైన్ షాప్‌లో మందేస్తున్న కోతి

అసలే కోతి ఆపైన కల్లు తాగితే ఎలా ఉంటుంది. రచ్చ రచ్చ చేయడం గ్యారంటీ కదా. కల్లుకే అలాంటి సామెతలు పుడితే ఇక ఫుల్ బాటిల్ ఎత్తేసి మందు తాగిన కోతి ఏం చేస్తుంది. అది ఇక ఊహించుకోవడమే కష్టం అనుకుంటారేమో. కానీ మందు తాగిన కోతి బుద్దిగా మంచినీళ్లు తాగి మెల్లగా అక్కడ నుండి జారుకుంటుంది. మధ్యప్రదేశ్ లోని బంజర్ గ్రామంలో ఈ కిక్కు కోరుకొనే కోతి కనిపిస్తుంది.

Viral Video: వైన్ షాప్‌లో మందేస్తున్న కోతి

Viral Video

Updated On : July 14, 2021 / 7:17 PM IST

Viral Video: అసలే కోతి ఆపైన కల్లు తాగితే ఎలా ఉంటుంది. రచ్చ రచ్చ చేయడం గ్యారంటీ కదా. కల్లుకే అలాంటి సామెతలు పుడితే ఇక ఫుల్ బాటిల్ ఎత్తేసి మందు తాగిన కోతి ఏం చేస్తుంది. అది ఇక ఊహించుకోవడమే కష్టం అనుకుంటారేమో. కానీ మందు తాగిన కోతి బుద్దిగా మంచినీళ్లు తాగి మెల్లగా అక్కడ నుండి జారుకుంటుంది. మధ్యప్రదేశ్ లోని బంజర్ గ్రామంలో ఈ కిక్కు కోరుకొనే కోతి కనిపిస్తుంది. ముందుగా ఈ కోతి గ్రామంలోని వైన్ షాప్ దగ్గరకెళ్ళి ఖాళీ సీసాలలోని చుక్కు చుక్క నోట్లో వేసుకొనేదట.

రుచి మరిగిన కోతి బుద్దిగా ఎలా ఉంటుంది. కొద్దిరోజులకు ఏకంగా షాప్ లోకి వెళ్లి ఓ ఫుల్ బాటిల్ పట్టుకొని అచ్చంగా మనుషులు తీసినట్లే మూత తీసి గడగడా తాగేసింది. మందు తాగిన అనంతరం నీళ్లు తాగిన కోతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రోజు ఇలానే మందు తాగుతుంది కదా పాపం అని ఎవరైనా స్టఫ్, తినుబండారాలు, బిస్కెట్లు పెడితే వాటిని తీసుకోవడం లేదట. కేవలం మందు కొట్టడం.. ఆ తర్వాత నీళ్లు తాగి కడుపులో మిక్సింగ్ చేయడం మాత్రమే చేస్తుందట.

అలా ఈ లిక్కర్ కోతి మందు తాగుతుండగా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారి దేశమంతా చేరిపోయింది. అయితే.. మనుషులంటే మందు కొని తాగుతారు. కానీ కోతికి వైన్ షాప్ యజమాని ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుందట. అందుకే కోతికి రోజూ మందు ఇవ్వలేమని.. ఇకపై అది రాకుండా ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. పాపం.. అలవాటైన ప్రాణం కదా మరి ఆ కోతి చుక్కెలా చేస్తుందో ఇక!