Chennai : స్నేహితుడి శవంపై కూర్చుని అఘోరా పూజలు.. సంచలనం రేపుతున్న సంఘటన

ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.

Chennai : స్నేహితుడి శవంపై కూర్చుని అఘోరా పూజలు.. సంచలనం రేపుతున్న సంఘటన

Chennai

Updated On : May 30, 2023 / 10:57 AM IST

Aghora Puja in Chennai : చనిపోయిన స్నేహితుడి శవంపై కూర్చుని పూజలు ఏంటి? అలా చేస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందా? చెన్నైలో ఓ అఘోరా చేసిన పూజ సంచలన రేపుతోంది.

Aghoraa : ఇప్పటివరకు అఘోరా పాత్రలో కనిపించిన హీరోలు వీళ్లే

సూలూరు సమీపంలోని కురుంబపాళయంలో మణికంఠన్, అతని భార్య, కుమారుడు ఉంటున్నారు. అంబులెన్స్ డ్రైవర్ అయిన మణికంఠన్ భార్య,కొడుకుని విడిచిపెట్టి మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల ఆ యువతితో గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మణికంఠన్ కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని సూలూరుకి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

సరిగ్గా అదే సమయంలో మణికంఠన్ స్నేహితుడనంటూ ఒక అఘోరా తన అనుచరులతో అక్కడికి వచ్చాడు. అతని ఆత్మశాంతి కోసం కొన్ని పూజలు చేయాలని కుటుంసభ్యులకు చెప్పాడు. వారు అంగీకరించడంతో మణికంఠన్ మృతదేహంపై కూర్చుని ధ్యానం చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ పూజలు చేశాడు. ఈ తతంగం అంతా చూసేవారిని భయభ్రాంతులకు గురి చేసింది. అఘోర పూజలు పూర్తైన తరువాత మణికంఠన్ అంత్యక్రియలు జరిగాయి.

Aghori Manikandan : అఘోరాను పెళ్లి చేసుకున్న మహిళ

చనిపోయిన వ్యక్తిపై కూర్చుని ఈ పూజలేంటని అక్కడికి వచ్చిన వారు వింతగా చూసారు. ఈ సంఘటన స్ధానికంగా సంచలనం సృష్టించింది.