Mukesh Ambani – Elon Musk : బిలియనీర్స్‌తో జిమ్ చేయిస్తున్న AI .. పిక్స్ వైరల్
ముకేష్ అంబాకీ, రతన్ టాటా, ఎలన్ మస్క్.... వీళ్లంతా జిమ్‌లో వర్కౌట్లు చేసే ఫోటోలు ఎప్పుడైనా చూసారా? సాహిద్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ AI ద్వారా రూపొందించిన వారి చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mukesh Ambani - Elon Musk
Mukesh Ambani – Elon Musk : ముఖేష్ అంబానీ.. రతన్ టాటా.. ఎలాన్ మస్క్ బిలియనీర్స్ అయిన వీరంతా జిమ్ లో వర్కౌట్లు చేస్తుంటే ఎలా ఉంటారు? AI రూపొందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఏదో ఒక ఆసక్తికరమైన కంటెంట్‌ను తయారు చేసి నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినిమా స్టార్ట్స్ వరకూ వారి చిన్నతనం, వృద్ధాప్యం వరకూ చూపించే AI చిత్రాలు అనేకం ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. తాజాగా సాహిద్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ AI సాయంతో రూపొందించిన ఫోటోలు షేర్ చేశాడు.
సాహిద్‌కి బిలియనీర్లు జిమ్‌కి వెళ్లి వర్కౌట్లు చేస్తుంటే ఎలా ఉంటారన్న ఆలోచన వచ్చింది. AI సాయంతో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్‌తో పాటు కొందరు బిలియనీర్ల ఫోటోలను రూపొందించాడు. “మనీ + మజిల్ = పవర్” అనే ట్యాగ్ లైన్‌తో అతను పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
Mukesh Ambani: ఉద్యోగికి ముకేశ్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్.. బాబోయ్.. ఏకంగా 1500కోట్లు ఇచ్చేశాడు..
ఇక ఈ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయని.. వాళ్ల చిన్ననాటి చిత్రాలను కూడా రూపొందించమని సాహిద్‌ను నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.
View this post on Instagram