AIMIM Party: యూపీ ఎన్నికల్లో ఎంఐఎం.. 100 స్థానాల్లో పోటీ

ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమైన ఓవైసీల అల్ ఇండియా మజ్లీస్ ఈ - ఇత్తెహాదుల్ ముస్లిమాన్ (AIMIM) పార్టీ గత కొంత కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అన్ని రాష్త్రాలలో కసరతులు ప్రారంభించి ఎన్నికల బరిలో దిగుతోంది.

AIMIM Party: యూపీ ఎన్నికల్లో ఎంఐఎం.. 100 స్థానాల్లో పోటీ

Aimim Party

Updated On : June 27, 2021 / 11:55 AM IST

AIMIM Party: ఒకప్పుడు హైదరాబాద్ పాత బస్తీకి పరిమితమైన ఓవైసీల అల్ ఇండియా మజ్లీస్ ఈ – ఇత్తెహాదుల్ ముస్లిమాన్ (AIMIM) పార్టీ గత కొంత కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అన్ని రాష్త్రాలలో కసరతులు ప్రారంభించి ఎన్నికల బరిలో దిగుతోంది. మహారాష్ట్రలో 2 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకటి రెండు చోట్ల విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో దూకుడు పెంచింది.

ఈక్రమంలోనే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బెంగాల్, తమిళనాడులో ఎక్కువ స్థానాలలో పోటీ చేసినా ఫలితం లేక పోయింది. అయినా ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే యూపీ 100కుపైగా స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించగా తాజాగా ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ మేము వస్తున్నాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ముస్లింల అభివృద్దే తమ ఎజెండాగా ఎన్నికలలో దిగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్​ అలీ ఇప్పటికే స్పష్టం చేయగా.. బీజేపీను ఓడించేందుకు ఏ కూటమిలోనైనా చేరేందుకు సిద్ధమని ప్రకటించారు.