పేరుకే ఐఫోన్.. iOS 14లో అన్ని ఆండ్రాయిడ్ ఫీచర్లేనంటున్న ఆపిల్!

  • Published By: srihari ,Published On : June 24, 2020 / 11:12 AM IST
పేరుకే ఐఫోన్.. iOS 14లో అన్ని ఆండ్రాయిడ్ ఫీచర్లేనంటున్న ఆపిల్!

Updated On : June 24, 2020 / 11:12 AM IST

పేరుకే ఐఫోన్.. ఆపిల్ అందిస్తోన్న iOS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే కొత్త ఫీచర్లన్నీ ఆండ్రాయిడ్ నుంచి తీసుకున్నావే. ఇదే విషయాన్ని ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ ఫంక్షనాల్టీతో ఉన్న ఫీచర్లను ఐఫోన్ iOS 14లోనూ వాడినట్టు తెలిపింది. అవేంటో ఓసారి చూద్దాం.. 

Home Screen Widgets :

ఇదే బిగ్ ఛేంజ్.. ఎన్నో ఏళ్లుగా ఐఓఎస్ హోం స్ర్కీన్లను స్టాటిక్ మోడల్ ఉంచిన ఆపిల్.. ఎట్టకేలకు యూజర్లను తమ హోం స్ర్కీన్లలో Widgets యాడ్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మధ్య విభిన్న ఫీచర్లలో ఒకటి. థర్డ్ పార్టీ సపోర్ట్, గ్యాలరీని అనుమతిస్తుంది. విడ్జిట్ ప్రివ్యూలలో iOS ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఆపిల్ సొంత విడ్జెట్లలో ఆండ్రాయిడ్ ఫీచర్లను ఉపయోగిస్తోంది. వాస్తవానికి ఆపిల్ కొత్త iOS 14 హోం స్ర్కీన్ ఎక్స్ పీరియన్స్‌తో గూగుల్ నుంచి పలు సూచనలు తీసుకుంటోంది కంపెనీ. 
ios

App List View :

ఆపిల్ లైబ్రరీని ఆపిల్ లిస్టు వ్యూతో తీసుకొచ్చింది. కానీ, గూగుల్ యాప్ డ్రాయర్ మాదిరిగానే ఉంటుంది. ఫోన్ లో ప్రతి యాప్ జాబితాలో హోం స్ర్కీన్ తో సంబంధం లేకుండా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ మాదిరిగా కాకుండా మ్యానివల్‌గా యాప్స్ హైడ్ చేసుకునేందుకు యూజర్లకు ఆపిల్ అనుమతినిస్తుంది. అది కూడా App Library Viewలోనూ కనిపిస్తుంది. ఆపిల్ యాప్ లైబ్రరీ కూడా ఆటోమాటిక్ గా వేర్వేరు కేటగిరీ యాప్స్ లో సోషల్, ఎంటర్ టైన్మెంట్ లేదా ఆపిల్ ఆర్కేడ్ మాదిరిగా కనిపిస్తున్నాయి. 
 

Third-Party Default Email and Browser Apps :

ఆండ్రాయిడ్ నుంచి తక్కువ ఫీచర్లను తీసుకుంది. ఐఓఎస్ 14‌లో ఆపిల్.. ఎట్టకేలకు తమ యూజర్లను మెయిల్, సఫారీకి బదులుగా డిఫాల్ట్ ఈమెయిల్, బ్రౌజర్ యాప్స్ సొంతగా ఎంచుకోనేందుకు అనుమతినిస్తుంది. ఈమెయిల్, బ్రౌజర్ యాప్స్ పరిమితం చేసింది. ఆపిల్ మ్యాప్స్, ఆపిల్ మ్యూజిక్ డిఫాల్ట్‌గా వాడుతోంది. గూగుల్ మ్యాప్స్, సాఫ్టీఫై కూడా ఫీచర్లకు సపోర్ట్ చేస్తాయి. 

list views

Discreet Voice Assistant And Calls :

IOS14లో SIRI కోసం ఆపిల్ కొత్త “discreet” వ్యూను ప్రవేశపెట్టింది. వాయిస్ అసిస్టెంట్ మొత్తం డిస్‌ప్లే‌కు బదులుగా స్క్రీన్ దిగువన చిన్న ఐకాన్‌తో కనిపిస్తుంది. స్క్రీన్ పై భాగంలో ఉన్న చిన్న విండోస్‌లో రిజల్ట్స్ డిస్ ప్లే చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఆండ్రాయిడ్‌లో ఎలా పనిచేస్తుందో అదే మాదిరిగా ఉంటుంది. అయినప్పటికీ దాని రిజిల్ట్స్ దిగువన ఉన్న చిన్న విండోలో కనిపిస్తాయి. ఆపిల్ కొత్త compact calls డిజైన్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఇన్ కమింగ్ కాల్స్ మొత్తం స్ర్కీన్ తొలగించకుండా నిరోధిస్తుంది. ఆండ్రాయిడ్‌లోని ఎంపికకు సమానంగా ఉంటుంది. 

 voice calls

App Slices/ App Clips :

iOS 14 కొత్త యాప్‌లో App Clips ఫీచర్ ఇదొకటి. మొత్తం యాప్ ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే యూజర్లను తమకు అవసరమైన చిన్న ప్యాకేజీలుగా సెట్ చేసుకోవచ్చు. 2018లో ఆండ్రాయిడ్ P యాప్, 2017లో వచ్చిన ఆండ్రాయిడ్ ఇన్ స్టంట్ యాప్స్ విషయంలోనూ గూగుల్ కూడా ఎన్నో క్రాక్స్ రిలీజ్ చేసింది. 
phones

Read: ఫస్ట్ ఇన్ ఇండియా: సరసమైన ధరలో OnePlus Z కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది!