Ananta babu: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్
కారు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్ నేటితో ముగియనుంది. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపరచాల్సి ఉంది.

Mlc Anantababu
Ananta babu: కారు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు రిమాండ్ నేటితో ముగియనుంది. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపరచాల్సి ఉంది. కోర్టుకి వేసవి సెలవులు కావడంతో వెకేషన్ కోర్టు జడ్జి (పిఠాపురం కోర్టు) విచారణ జరపనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో అనంత బాబు ఉన్న విషయం తెలిసిందే.
Delhi: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
అయితే, కోనసీమ అల్లర్ల దృష్ట్యా పోలీసులు అక్కడ ఉండడంతో అనంతబాబుకు భద్రత ఇవ్వలేమని సెంట్రల్ జైల్ అధికారులు అంటున్నారు. దీంతో కోర్టుకు వీడియో లింకేజ్ ద్వారా అనంతబాబు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనంత బాబు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, ఇప్పటి వరకు కస్టడీ పిటిషన్‌ను పోలీసులు వేయలేదు.