AP Corona Upadate : ఏపీలో కొత్తగా 2,252 కరోనా కేసులు.. 15 మంది మృతి

ఆదివారం ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 2,252 మందికి కరోనా సోకింది. 15 మంది మృతిచెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 155 కరోనా యాక్టివ్ కేసులున్నాయి

AP Corona Upadate : ఏపీలో కొత్తగా 2,252 కరోనా కేసులు.. 15 మంది మృతి

Ap Corona Upadate (2)

Updated On : July 25, 2021 / 6:15 PM IST

AP Corona Update : ఆదివారం ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 2,252 మందికి కరోనా సోకింది. 15 మంది మృతిచెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 155 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 13 వేల 256 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 440 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో చనిపోయారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు

అనంతపురం 41. చిత్తూరు 316. ఈస్ట్ గోదావరి 385. గుంటూరు 171. వైఎస్ఆర్ కడప 98. కృష్ణా 240. కర్నూలు 53. నెల్లూరు 269. ప్రకాశం 241. శ్రీకాకుళం 64. విశాఖపట్టణం 125. విజయనగరం 27. వెస్ట్ గోదావరి 222. మొత్తం : 2,252