AP New Cabinet : బీసీ లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్-సజ్జల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన రోజు నుంచి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు విధానాల పరంగా, రాజ్యాంగ పరంగా పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Sajjala Ramakrishna reddy
AP New Cabinet : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన రోజు నుంచి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు విధానాల పరంగా, రాజ్యాంగ పరంగా పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నూతన మంత్రి వర్గ కూర్పులో చేపట్టిన కసరత్తు గురించి ఆయన ఈరోజు విలేకరులకు వివరిస్తూ….బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అనేలా వారికి ప్రాతినిధ్యం కల్పించేలా జగన్ మంత్రివర్గ కూర్పు చేశారని వివరించారు. 2019 లో ఇచ్చిన మంత్రి వర్గంలో కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారు. గత కేబినెట్ లో 14 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఇస్తే 11 మందికి ఓసీలకు స్ధానం కల్పించారని అది విప్లవాత్మకమైన చర్య అని సజ్జల చెప్పారు.
అదే కొనసాగింపుగా రేపు ప్రమాణం చేయబోయే మంత్రి వర్గంలో బీసీలకు మైనార్టీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు ఒకటి , ఓసీలకు 8 మందికి అవకాశం ఇచ్చి కొత్తక్యాబినెట్ పునర్వవస్ధీకరణ జరుగుతోందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కారని, ఆయన వారిని నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్ వెంట నడుస్తున్నారని సజ్జల అన్నారు.
Also Read : Kotamreddy Sridhar Reddy Cries : మంత్రి పదవి రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే
ఏపీలో తొలిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేశారని ఇది సగర్వంగా చెప్పుకుంటామని అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 25 మందిలో 48 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారని, ఈరోజు 68 శాతం ఉన్నారని చెప్పారు.