AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల

Ap Inter Results

Updated On : June 17, 2022 / 8:07 AM IST

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశాలున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.

Covid-19: కరోనా తగ్గిన చిన్నారుల్లో కాలేయ వ్యాధి ముప్పు

విద్యార్థులు https://bie.ap.gov.in/ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఇంటర్ పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు సాధించాలి. ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందాలి అంటే విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. తాజా పరీక్షల సమయంలో తుపాను కారణంగా ఒక పరీక్ష వాయిదా పడగా, తరువాత దాన్ని నిర్వహించారు.