Army Captain Proposal: ప్రేమ గెలిచింది.. కానీ ప్రోటోకాల్ తప్పింది.. ఆర్మీ కెప్టెన్ రొమాన్స్ పై రక్షణ శాఖ సీరియస్
ప్రేయసికి కొత్తగా తన ప్రేమను వ్యక్తిపరిచి కొత్త చిక్కులు తెచ్చుకున్న ఆర్మీ అధికారి(Army Captain Proposal).
Army captain proposes to girlfriend at aviation school and faces disciplinary action
- వైరల్ ప్రపోజల్ పై మిలిటరీ సీరియస్
- ప్రేమలో పడి రూల్స్ తప్పిన కెప్టెన్
- నాసిక్ ఆర్మీ అకాడమీలో వింత సంఘటన
Army Captain Proposal: మనం ఇప్పటివరకు చాలారకాల లవ్ ప్రపోజల్స్ చూసి ఉంటాం. కానీ, ఇది చాలా కొత్తగా ఉంటుంది. తన ప్రేయసికి సరికొత్తగా తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకున్నాడు ఒక ఆర్మీ అధికారి.కానీ, అందుకోసం చేసిన ప్రయత్నం ఆ అధికారికి కొత్త చుక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తాజాగా నాసిక్ లోని ఆర్మీ ఏవియేషన్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఆ పరేడ్ లో కెప్టెన్(Army Captain Proposal) భరత్ భరద్వాజ్ కూడా పాల్గొన్నాడు.
ఐయితే, ఆ పరేడ్ కార్యక్రమం ముగిసిన వెంటనే తన ప్రేయసి ఆరుషికి అక్కడే మిలిటరీ హెలికాప్టర్ ముందే మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఆ అధికారి ప్రేమను ఆ అమ్మాయి కూడా అంగీకరించింది. రొమాంటిక్ సినిమా సీన్‌ను తలపించే ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. కానీ, ఈ వైరల్ వీడియో ఇప్పుడు ఆ యువ అధికారికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. సాధారణంగా, సైన్యంలో క్రమశిక్షణే పరమావధిగా భావించే ఉన్నతాధికారులు. అందుకే, ఆ యువ ఆర్మీ అధికారిక చేసిన పనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
డిఫెన్స్ ఇన్స్టాలేషన్లు, అధికారిక మిలిటరీ వేడుకలు అనేది వ్యక్తిగత వేడుకల కోసం కాదని, ఈ ప్రపోజల్ సైనిక నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే సదరు అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు, ఈ ఘటన దేశవ్యాప్తంగా మిలిటరీ డెకోరమ్, వ్యక్తిగత భావోద్వేగాల మధ్య ఉన్న సరిహద్దులపై పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది, దీనిని ఆ యువకుడి జీవితకాల మైలురాయిగా సమర్థిస్తుండగా, రక్షణ రంగానికి సంబంధించిన సున్నిత ప్రాంతాలలో ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
