Army chief : భూటాన్ పర్యటనకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే.. చైనా కుట్రలకు చెక్ పడేనా!
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శుక్రవారం రెండు రోజుల భూటాన్ పర్యటనను మొదలు పెట్టారు. కొత్త ఉపగ్రహ చిత్రాలు భూటాన్ వైపు డోక్లామ్ పీఠభూమికి తూర్పున చైనా గ్రామాన్ని నిర్మించడాన్ని సూచిస్తున్నాయి. ఇది భారతదేశంపై చైనా చేస్తున్న కుట్రగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ భూటాన్ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది.

Army Chief Manoj Pande
Army chief : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శుక్రవారం రెండు రోజుల భూటాన్ పర్యటనను మొదలు పెట్టారు. కొత్త ఉపగ్రహ చిత్రాలు భూటాన్ వైపు డోక్లామ్ పీఠభూమికి తూర్పున చైనా గ్రామాన్ని నిర్మించడాన్ని సూచిస్తున్నాయి. ఇది భారతదేశంపై చైనా చేస్తున్న కుట్రగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ తన పర్యటనలో భాగంగా కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో భేటీ కానున్నారు.
China: మా దేశంపై దాడి చేసేందుకు చైనా ఆర్మీకి 2025లోపు పూర్తి సామర్థ్యం: తైవాన్
ఆర్మీ చీఫ్ భూటాన్ పర్యటన ప్రత్యేకమైన సమయం, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య అత్యంత విశ్వాసం, సద్భావన, పరస్పర అవగాహనతో ఉంటుందని సైన్యం ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉంటే భూటాన్ మూడవ రాజు జిగ్మే దోర్జీ వాంగ్‌చుక్ జ్ఞాపకార్థం నిర్మించిన థింపులోని నేషనల్ మెమోరియల్ చోర్టెన్ వద్ద నివాళులర్పించడం ద్వారా పాండే శుక్రవారం భూటాన్ దేశంలో తన పర్యటనను ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో రెండు సైన్యాల మధ్య బలమైన సాంస్కృతిక, వృత్తిపరమైన బంధాలను ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఆర్మీ చీఫ్ రాయల్ భూటాన్ ఆర్మీలోని బృదంతో విస్తృతమైన చర్చలలో పాల్గొంటారని ఆర్మీ తెలిపింది.
Bharath-china : భూటాన్ లో చైనా గ్రామాల నిర్మాణం..భారత్ పై కుట్రలకు సంకేతమా?
జూలై 19న డోక్లామ్ చిత్రాలు బయటకు వచ్చిన తర్వాత దేశ భద్రతకు సంబంధించిన అన్ని పరిణామాలపై భారతదేశం నిరంతరం నిఘా ఉంచుతుందని, దాని ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. డోక్లామ్ పీఠభూమిలో పరిస్థితితో పాటు ఆ ప్రాంతంలోని చైనా కార్యకలాపాలు పాండే భూటాన్ మధ్యవర్తులతో చర్చలు జరపనున్నారు. భూటాన్ తమకు చెందినదని పేర్కొన్న ప్రాంతంలో చైనా రహదారిని విస్తరించడానికి ప్రయత్నించిన తర్వాత డోక్లామ్ ట్రై-జంక్షన్‌లో 73 రోజుల స్టాండ్‌ఆఫ్‌లో భారత, PLA దళాలు లాక్ చేయబడ్డాయి. గత ఏడాది అక్టోబర్‌లో భూటాన్, చైనా తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలను వేగవంతం చేయడానికి “మూడు-దశల రోడ్‌మ్యాప్” పై ఒక ఒప్పందంపై సంతకం చేసిన విషయం విధితమే.
General Manoj Pande #COAS proceeded on a visit to #Bhutan. The visit will further cement the historical bilateral ties and #DefenceCooperation between #India and #Bhutan. #IndianArmy#IndiaBhutanFriendship pic.twitter.com/4JCtRGHnKV
— ADG PI – INDIAN ARMY (@adgpi) July 29, 2022
భూటాన్ చైనాతో 400 కిలోమీటర్ల పొడవునా సరిహద్దును కలిగిఉంది. వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఇరు దేశాలు 24 రౌండ్ల సరిహద్దు చర్చలు జరిపాయి. భారతదేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా డోక్లామ్ ట్రై జంక్షన్ ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 2017లో డోక్లామ్ పీఠభూమిలో భారత్-చైనా మధ్య జరిగిన ప్రతిష్టంభన రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య యుద్ధ భయాలను కూడా రేకెత్తించింది. భూటాన్ ఆ ప్రాంతం తమకు చెందినదని, భూటాన్ వాదనకు భారత్ మద్దతు తెలిపింది. డోక్లామ్ ట్రై జంక్షన్ వద్ద రహదారి నిర్మాణాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది.