Woman sketching a picture : ఆటో ఎక్కింది.. దిగేలోపు ఆమె ఏం చేసిందంటే?

బిజీ లైఫ్‌లో పక్కవారిని పట్టించుకునేంత టైం ఉండదు. కానీ కొందరు ఆర్టిస్ట్‌లకి మాత్రం భలే ఆలోచనలు వస్తాయి. ఆటోలో ప్రయాణం చేసిన ఓ మహిళ ఆటో డ్రైవర్ చిత్రాన్ని గీసింది. తన చిత్రాన్ని చూసుకుని అతను తెగ సంబరపడిపోయాడు.

Woman sketching a picture :  ఆటో ఎక్కింది.. దిగేలోపు ఆమె ఏం చేసిందంటే?

Woman sketching a picture

Updated On : May 3, 2023 / 11:39 AM IST

Woman sketching a picture :  ఆటో ఎక్కామా? గమ్య స్ధానానికి చేరామా? పైసలు ఇచ్చామా? అంతే ఆలోచిస్తాం.. కానీ కొందరు ఆర్టిస్ట్‌లు ప్రతి ఒక్కరి పనిని .. వారిని నిశితంగా గమనించి చిత్రాలు గీస్తారు. ఆటో ఎక్కిన ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ చిత్రాన్ని గీసి అతనికి ఇచ్చింది. అతని ముఖంపై చిరునవ్వు మెరిసింది.

Kashmiri artist turned autowala : జాతీయ అవార్డు గెలుచుకున్న కాశ్మీరీ ఆర్టిస్ట్.. ఆటో రిక్షా నడుపుతున్నాడు.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఓ మహిళ ఆటో ఎక్కింది. ఆమె ప్రయాణించింది చాలా తక్కువ దూరం. అయినా ఈ కాస్త సమయంలో ఆటో డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లుగా వెనుకవైపు నుంచి అతని చిత్రాన్ని గీసింది. దానిని డ్రైవర్‌కి ఇస్తున్నప్పుడు అతను ఎంతో సంతోషించాడు. ఈ చిత్రాన్ని @artcartbydiksha అనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘ఇకపై తరచుగా ఇలాంటివి గీస్తూ ఉంటాను. ఈ చిత్రం గీసింది కేవలం అతనికి కృతజ్ఞతలు చెప్పడానికే’.. అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ వీడియోను మిలియన్ కంటే ఎక్కువమంది వీక్షించారు. ‘మేడ్ హిజ్ డే’ ..’చాలా మంచి పని చేశారు’ అంటూ కామెంట్లు పెట్టారు.

Hema Malini : సాధారణ వ్యక్తిలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మెట్రో, ఆటో రిక్షా ప్రయాణం..

ఎవరి టాలెంట్‌ని అయినా ప్రదర్శించుకునేందుకు సోషల్ మీడియా ఇప్పుడు అతి పెద్ద ప్లాట్‌ఫామ్. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించే వారి నుంచి డ్యాన్సులు, వంటలు ఇలా ఎన్నో పనులు చేస్తూ ఎంతోమంది ప్రతిభావంతులు నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎవరు ఏ స్ధాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

View this post on Instagram

 

A post shared by Art enthusiast & educator (@artcartbydiksha)